LEFT Parties: ఒంటిరిగా పోటీ చేస్తే సీట్లు రావాయే.. పొత్తు పెట్టుకుందామంటే సీట్లు ఇవ్వరాయే.. కేడర్‌లో అయోమయం
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో వామ పక్షాలు దారెటనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లా ఈ ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా?. అసలు వామపక్షాలు పోటీ చేస్తాయా అనే ఉత్కంఠ నెలకొంది. కేడర్ అయోమయానికి గురవుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నా.. వామపక్షాల్లో క్లారిటీ కరువైంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటాయా? లేక విడిగా పోటీ చేస్తాయా అనే దానిపై ఇంతవరకూ స్పష్టత రాలేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మంలో వామ పక్షాలు దారెటనే చర్చ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లా ఈ ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా?. అసలు వామపక్షాలు పోటీ చేస్తాయా అనే ఉత్కంఠ నెలకొంది. కేడర్ అయోమయానికి గురవుతోంది.
తెలంగాణలో వామపక్షాల పరిస్థితి ముందుకు పోతే గొయ్యి.. వెనక్కొస్తే నుయ్యి అన్నట్లు తయారైంది. వామపక్షాలకు ఒంటిరిగా పోటీ చేస్తే సీట్లు రావాయే.. పోత్తు పెట్టుకుందామంటే సీట్లు ఇవ్వరాయే. దీంతో పార్లమెంట్ ఎన్నికల వేళ ఏం చేయాలో తెలియక గందరగోళానికి గురవుతున్నాయి వామపక్షాలు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్నా.. వామపక్షాల్లో క్లారిటీ కరువైంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటాయా? లేక విడిగా పోటీ చేస్తాయా అనే దానిపై ఇంతవరకూ స్పష్టత రాలేదు. అయితే ఖమ్మం జిల్లాలో వామపక్ష పార్టీలకు కొంతమేర బలముంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ.. కాంగ్రెస్ పొత్తుపెట్టుకొనన్నాయి. కొత్తగూడెం నుంచి కూనం నేని సాంబశివరావు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.. సీపీఐ కాంగ్రెస్‌తో సంబంధాలు కంటిన్యూ చేస్తుంది. అటు సీపీఎం మాత్రం కోరిన సీట్లు ఇవ్వక పోవడంతో ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు గల్లంతైంది. అప్పటినుంచి తటస్థంగా ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తులో పోటీ చేయాలని భావిస్తుంది. ఇప్పటికే ఆపార్టీ నేత సుముఖంగా ఉన్నట్లు చెప్పారు.
అటు ఇండియా కూటమి.. ఇటు రాష్ట్రంలో పొత్తులో భాగంకావడంతో సీపీఐ మాత్రం 5 ఎంపీ సీట్లు ప్రతిపాదన పెట్టింది. సీపీఐ అభ్యర్థనకు కాంగ్రెస్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇప్పటికే 17 లోక్‌సభ స్థానాల్లో 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థి ఎంపికలో తీవ్ర పోటీ ఉండటంతో రిజర్వ్‌లో పెట్టింది. అదే ఖమ్మం సీటుపై వామపక్షాలు గంపెడు ఆశలు పెట్టుకున్నాయి. కాంగ్రెస్ ప్రతిపాదనలు పెట్టి రోజులు గుడుస్తున్నా.. కాంగ్రెస్ వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. కలిసొచ్చే పార్టీలతో ముందుకెళ్తామని చెబుతున్నప్పటికీ.. వామ పక్షాలకు సీట్లు ఇచ్చే ఆలోచన మాత్రం చేయడం లేదని టాక్ వినిపిస్తుంది.
గతంలో ఖమ్మం నుంచి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎంపీగా ఎన్నికయ్యారు. ఆతర్వాత పొత్తులో వివిధ పార్టీలకు మద్దతు తెలుపుతూ వస్తున్నారు. గతంతో పోలిస్తే ఉనికిని కోల్పోతున్నారు. అందుకే ఇతర పార్టీలు వామ పక్షాలకు సీట్లు ఇచ్చే విషయంలో ఆలోచిస్తున్నాయి. అయితే అటు సీపీఐ, ఇటు సీపీఎంకు చెందిన ఇద్దరు కార్యదర్శులు ఖమ్మం జిల్లాకు చెందిన వారే కావడం.. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధత, కార్యాచరణపై స్తబ్దుగా ఉండడం కేడర్‌ని అయోమయానికి గురిచేసుతంది. అసలు ఖమ్మం బరిలో వామపక్షాలు అభ్యర్థిని బరిలోకి దించుతారా?.. లేక కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతారా? అనే ఉత్కంఠ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…