Coins Collection Hobby: మనందరికీ ఏదో ఒక అభిరుచి ఉంటుంది. కొందరు చిత్రలేఖణం అయితే మరికొందరికి పాటలు పాడడం ఇలా ఏదో ఒక హాబీ తప్పకుండా ఉండే ఉంటుంది. ఇలాంటి అభిరుచుల్లో విదేశాలకు చెందిన నాణేలు, కరెన్సీ సేకరించడం ఒకటి. అయితే చాలా వరకు ఇలాంటి కరెన్సీ సేకరణ అనేది డబ్బులున్న వారు చేస్తుంటారు. అయితే అభిరుచికి పేదరికం అడ్డు కాదని నిరూపించాడు మహబూబ్ నగర్‌కు చెందిన ఓ సామాన్యుడు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ తన అభి రుచిని సాకారం చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. మహూబ్ నగర్‌కు చెందిన పి. లక్ష్మయ్య వృత్తి రీత్య ఓ హోటల్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే లక్ష్మయ్యకు నాణేలు సేకరించాలనే అభిరుచి ఉండేది. దీనికి తన ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా.. ఏకంగా 180 దేశాలకు చెదిన కరెన్సీతోపాటు పురాతన నాణేలు సేకరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. తన స్థోమతకు మించి ఖర్చు పడుతూ కరెన్సీని సేకరిస్తున్నాడు. ఇప్పటికే 180 దేశాల కరెన్సీ తో పాటు భారత దేశానికి చెందిన పురాతన నాణాలను, ఇతర దేశాల నాణాలను సేకరించాడు. ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన 150 నాణాలతో పాటు రెండు వందల కరెన్సీ నోట్లను సేకరించాడు లక్ష్మయ్య. తాను సేకరించిన కరెన్సీకి లామినేషన్ చేయించడంతో పాటు అది ఏ దేశానికి చెందినదో స్పష్టంగా రాసి ఉంచాడు.
1968 నుంచి లక్ష్మయ్య కరెన్సీ సేకరణ ప్రారంభించారు. స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, కువైట్, ఇరాక్, నెదర్లాండ్, శ్రీలంక, రష్యా, అమెరికా దేశాల కరెన్సీ నోట్లు, నాణాలను సేకరించాడు. భారత్‌లో చెలామణి అయిన పురాతన కరెన్సీ, నాణాలను సేకరించి భద్రపరిచాడు. ఇక కేవలం ఇక్కడితోనే ఆగని లక్ష్మయ్య.. శాతకర్ణి, కాకాతీయ, ఔరంగాజేబు, నిజాం నవాబుల కాలం నాటి నాణాలతో పాటు ఈస్ట్ ఇండియా నాణాలను కూడా సేకరించాడు. తనకు ఎవరైనా దాతలు సహకరిస్తే ఈ పురాతన నాణాలను ఫ్రేమ్ కట్టించి తర్వాతి తరానికి అందిస్తానని చెబుతున్నాడు. ఇక తన ఈ నాణాల సేకరణలో తన భార్య మణెమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని లక్ష్మయ్య అభిప్రాయపడుతున్నాడు.
సమీ
టీవీ9 రిపోర్టర్, మహబూబ్ నగర్.
Also Read: Rare Snake: అరుదైన కింగ్ కోబ్రా హల్‌చల్.. హడలిపోయిన అటవీశాఖ అధికారులు.. ఎక్కడంటే.?
Meera Mithun: మీరా మిథున్‌కు మరోసారి షాక్.. దళితులపై విమర్శల విషయంలో కోర్టు తీర్పు ఏంటంటే..
Telangana Weather Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. రానున్న మూడు గంటల పాటు దంచికొట్టనున్న వాన..