Telangana: బౌలింగ్ చేస్తూ గ్రౌండ్‌లో కుప్పకూలిపోయాడు.. ఏమైందో అర్థమయ్యేలోపే..

మనిషి గుండె ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఆగుతుందో అర్థం కావడం లేదు. రీసెంట్ టైమ్స్‌లో హర్ట్ ఎటాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా.. కళ్లముందే కుప్పకూలి ప్రాణాలిడుస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్.. క్షణాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిపేస్తుంది. రీజన్ ఏదయినా.. హెల్త్ విషయంలో ఏమాత్రం అజాగ్రత్త వద్దంటున్నారు డాక్టర్లు. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా...

Telangana: బౌలింగ్ చేస్తూ గ్రౌండ్‌లో కుప్పకూలిపోయాడు.. ఏమైందో అర్థమయ్యేలోపే..
Vijay

Edited By:

Updated on: Jan 17, 2025 | 2:48 PM

రోజు రోజుకీ గుండెపోటు మరణాలు ఎక్కువ అవుతున్నాయి.. ఆ వయస్సు..ఈ వయస్సు అనే తేడా లేకుండా..చిన్న పిల్లలు నుంచి పెద్ద వయస్సు వరకు హార్ట్ స్ట్రోక్‌తో మరణిస్తున్నారు.  ప్రస్తుతం ఈ అంశం ఆందోళన కలిగిస్తోంది. ఉరుకుల పరుగుల జీవితం, స్ట్రెస్, వర్క్ లోడ్, ఆహారపు అలవాట్లు… ఇవ్వన్నీ గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అప్పటి వరకు హుషారుగా పని చేస్తూ..అందరితో కలివిడిగా గడిపిన వారు ఒక్కసారిగా కుప్పకూలి మరణిస్తున్నారు. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి.  తాజాగా ఖమ్మం జిల్లా కూసుమంచిలో విషాదం చోటుచేసుకుంది. క్రికెట్ ఆడుతూ విజయ్ అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు.

తోటి ఫ్రెండ్స్ తో సరదాగా గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి పోయాడు విజయ్. ఏమి జరిగిందో తెలియక ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. ఆస్పత్రికి తరలించేసరికే మృతిచెందాడు.  సంక్రాంతి పండుగ సందర్భంగా కూసుమంచిలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తూ ఒక్కసారిగా విజయ్ కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న వారు వెంటనే అతన్ని ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విజయ్ కుటుంబం ఇరవై సంవత్సరాల క్రితం చెన్నై నుంచి వ్యాపార నిమిత్తం వచ్చి
కూసుమంచిలో స్థిరపడ్డారు. అప్పటివరకు తమతో ఆనందంగా గడిపిన విజయ్ గుండెపోటుతో మృతి చెందడంతో తోటి మిత్రులు విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి