TCongress: బీజేపీకి కూన శ్రీశైలం గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక

|

Apr 05, 2024 | 10:23 PM

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిక పర్వం ఊపందుకుంది. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీలో చేరగా, తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

TCongress: బీజేపీకి కూన శ్రీశైలం గుడ్ బై.. కాంగ్రెస్ లో చేరిక
Kuna
Follow us on

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరిక పర్వం ఊపందుకుంది. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీలో చేరగా, తాజాగా మరో కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత కూన శ్రీశైలం గౌడ్ శుక్రవారం ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జీ దీపాదాస్ మున్సీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం గౌడ్ బీజేపీలో చేరారు.  2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి కేపీ వివేకానంద్ చేతిలో ఓడిపోయారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ టీవీ డిబేట్ సందర్భంగా గౌడ్ పై వివేకానంద్ దాడి చేసిన వీడియో ఆన్ లైన్ లో పాపులర్ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేతలు పట్నం మహేందర్ రెడ్డి, మైనంపల్లి హన్మంతరావు గౌడ్ ను ఆయన ఇంటికి వెళ్లి రేవంత్ రెడ్డి తరఫున కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలనే భావనతో, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో కూన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) విడుదల చేసిన నాలుగో విడత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్లో భాగంగా మే 13న తెలంగాణలో పోలింగ్ జరగనుంది.