AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KTR: సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగ అదిరిపోవాలి.. వీడియో కాన్ఫెరెన్స్‌లో కేటీఆర్ దిశా నిర్దేశం

సెప్టెంబర్ రెండవ తేదీన జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

KTR: సెప్టెంబర్ 2న జరిగే పార్టీ జెండా పండగ అదిరిపోవాలి.. వీడియో కాన్ఫెరెన్స్‌లో కేటీఆర్ దిశా నిర్దేశం
KTR
Venkata Narayana
|

Updated on: Aug 31, 2021 | 11:10 AM

Share

KTR – September 2nd: సెప్టెంబర్ రెండవ తేదీన జరిగే పార్టీ జెండా పండగను ఘనంగా నిర్వహించాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. గ్రామలు, పట్టణాలలోని వార్డుల్లో పార్టీ జెండాను ఎగురవేసి పార్టీ కార్యక్రమాలను ప్రారంభించాలని కోరారు. ఈమేరకు ఈ రోజు మంత్రులు, యంఏల్యేలు, యంపిలు, యంఎల్సీలు, జెడ్పిటీసిలు, యంపిటిసిలు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ర్ట కార్యవర్గం, పార్టీ సర్పంచులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పార్టీ సంస్ధగత నిర్మాణంపైన దిశానిర్దేశం చేశారు.

సెప్టెంబర్ రెండో తేదిన జరిగే పార్టీ జెండా పండగ కార్యక్రమానికి గ్రామ, వార్డులో పరిధిలో పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ వచ్చేలా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలన్నారు. అదే రోజు డీల్లీలో పార్టీ కార్యాలయ భవనానికి సియం కెసియార్ చేస్తున్న శంఖుస్థాపనకు పార్టీ యంఏల్యేలు, నాయకులు హాజరవుతున్న నేపథ్యంలో స్థానిక నాయకత్వం ఈ జెండా పండగ విజయవంతానికి ‌కృషి చేయాలన్నారు. ఈమేరకు యంఏల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, సినియర్ నాయకులు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేయాలన్నారు.

ఈ జెండా పండగ తర్వత వెంటనే పార్టీ సంస్ధాగత నిర్మాణంలో భాగంగా కమీటీల ఎర్పాటు ప్రక్రియను ప్రారంభించాలన్నారు. ఈమేరకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు గ్రామపంచాయతీలు, వార్డు కమిటీల ఏర్పాటు చేయాలన్నారు. సెప్టెంబర్ 12 నుంచి 20వ తేదీ వరకు మండల మరియు పట్టణ కమిటీలను నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. సెప్టెంబర్ 20 వ తేదీ తర్వాత జిల్లా కార్యవర్గాల ఎంపిక మరియు జిల్లా అధ్యక్షుల ఎంపికను స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు రాష్ట్ర నాయకత్వం సమన్వయం చేసుకొని ప్రకటిస్తుందని తెలిపారు. జిల్లా కార్యవర్గాల ఎంపిక తర్వాత రాష్ట్ర కార్యవర్గాన్ని ముఖ్యమంత్రి.. పార్టీ అధ్యక్షులు కె. చంద్రశేఖరరావు ప్రకటిస్తారని కేటీఆర్ తెలిపారు.

జిల్లా అద్యక్షులు నూతన జిల్లా కార్యవర్గాలను పార్టీ ఎంఏల్యేలు, యంపిలతో సమన్వయం చేసుకుని ప్రకటిస్తారని కేటీఆర్ వెల్లడించారు. పార్టీ కమిటీల కూర్పు విషయంలో కేటీఆర్ పలు సూచనులు చేశారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికే ఈ కమిటీలలో చోటు ఉంటుందన్నారు. పార్టీ కమిటీల్లో ఎస్సీ, ఎస్ టి, బిసి, మైనారిటీలు కచ్చితంగా 50 శాతం ఉండాలని, లేకుంటే అయా కమీటీలు చెల్లవన్నారు. పార్టీ అనుబంధ కమీటీలతో పాటు గ్రామ, మండల స్థాయి పార్టీ సోషల్ మీడియా కమిటీ ఏర్పాటుకు సూచనలు చేశారు. ముందుగా మండల కమిటీలు పూర్తి చేసిన తర్వతా గ్రామ స్ధాయి సోషలు మీడియా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కమీటీల్లో మహిళా కార్యకర్తలకు తగిన చోటు కల్పించాలని సూచించారు.

హైదరాబాద్ నగర విస్తృతి, జనాభా మరియు ఇక్కడి పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక నగర సమావేశం ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. నగరంలో బస్తి కమిటీ మరియు డివిజన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని, ఈ కమిటీల ఏర్పాటులో నగర ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిలు, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్రస్థాయి నాయకత్వం ఈ విషయంలో సమన్వయం చేసుకుంటు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతారన్నారు. సెప్టెంబర్ తొలి వారంలో హైదరాబాద్ నగర ప్రత్యేక సమావేశం త్వరలో ఉంటుందని తెలిపారు.

Read also: Assam grim: అసోం జనం ఆర్తనాదాలు.. తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు కూడా లేని దుర్భర పరిస్థితిలు