KTR: ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. ఎంతో పనిచేశాం. కానీ.. ఎన్నికల్లో ఓడిపోయాం అంటే.. కార్యకర్తలు చేసిన తెలివితక్కువ పనే కారణమన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంకోసారి అలా చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇంతకీ కేడర్ చేసిన తప్పేంటి? ఫలితాలపై పార్టీలో అంతర్మథనం జరిగిందా?..

KTR: ఆయన తప్పేం లేదు. అంతా మనమే చేశాం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..
KTR

Updated on: Sep 24, 2025 | 8:45 PM

తెలంగాణ సాధించిన పార్టీగా.. రెండుసార్లు అధికారంలో ఎన్నో పనులు చేసిన బీఆర్‌ఎస్.. రెండేళ్లుగా ప్రతిపక్షంలో ఉంది. 2023 ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌కు ఓటేశారంటూ మొన్నటిదాకా ఆ పార్టీ నేతలు వాదించారు. కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు తప్పు చేశారంటూ కేటీఆర్ సహా ఆ పార్టీ నేతలందరిదీ ఇదే మాట. కానీ.. ఇప్పుడు ఆ పార్టీ నేతల ఆలోచన మారింది. ప్రజలను నిందించడం సరికాదంటూ కేడర్‌కు హితబోధ చేశారు కేటీఆర్.. ప్రజలు రెండుసార్లు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి ఓటు వేయాలేదని ప్రజల మీద నెపం పెట్టడం సరికాదన్నారు.

కింది స్థాయి నాయకుల దగ్గరే తప్పు ఉందన్న కేటీఆర్..

అధినాయకుడి దగ్గర ఏ మాత్రం లోపం లేదు. దేశంలో ఏ సీఎం చేయనంత గొప్పగా పనిచేసినా ఓడిపోయామంటే కింది స్థాయి నాయకుల దగ్గరే తప్పు ఉందంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేడర్ తెలివితక్కువ ఆలోచనే ఓటమికి కారణం ..

మా ఎమ్మెల్యే ఓడిపోవాలి. కానీ కేసీఆర్ సీఎంగానే ఉండాలని కొందరు నాయకులు తెలివితక్కువ ఆలోచన చేశారు. అదే పార్టీకి నష్టం చేసిందన్నారు కేటీఆర్.. చిన్న చిన్న కారణాలతో కేడర్ అలసత్వంగా ఉండటంతోనే స్వల్ప తేడాతో ఓడిపోవాల్సి వచ్చిందని వివరించారు. పార్టీలోనే లోపం ఉంది. నాయకుల ఆలోచనలోనే తప్పు ఉంది. వాటిని సరిచేసుకుని ప్రజల మన్ననలు పొంది.. మళ్లీ అధికారంలోకి రావాలంటూ కేటీఆర్ కేడర్‌కి సూచించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..