KTR: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్.. ఏమన్నారంటే..

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ పడటంతో కేటీఆర్ కు గాయాలయ్యాయి.. దీంతో వైద్యులు ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో తాను రికవరీ అవుతున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.

KTR: జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ గాయపడిన కేటీఆర్‌.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్.. ఏమన్నారంటే..
Pawan Kalyan KTR

Edited By: Shaik Madar Saheb

Updated on: Apr 29, 2025 | 6:42 AM

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గాయపడ్డారు. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తూ పడటంతో కేటీఆర్ కు గాయాలయ్యాయి.. దీంతో వైద్యులు ఆయనకు కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. ఈ విషయాన్ని కేటీఆర్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో షేర్ చేశారు. వైద్యుల పర్యవేక్షణలో తాను రికవరీ అవుతున్నట్లు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే కేటీఆర్ వెల్లడించారు. త్వరగా కోలుకొని రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు ప్రముఖులు బీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పోస్టులు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ స్పందన..

రాజకీయంగా ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా స్నేహితులు అనే విషయాన్ని జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి రుజువుచేశారు. తెలంగాణ మాజీ మంత్రి కె.టి.రామారావు జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డట్టు ఆయన పోస్టు చేయడంతో.. పవన్ కల్యాణ్ స్పందించారు. కె.టి.ఆర్. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

పవన్ కల్యాణ్ ట్వీట్:

“కె.టి.ఆర్ గారికి గాయం జరిగిన సంగతి తెలుసుకొని బాధ పడ్డాను. వైద్యుల సూచనల మేరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని కోరుతున్నాను. మీరు త్వరగా కోలుకోవాలని మనసారా ప్రార్థిస్తున్నాను.” అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.


కాగా.. పవన్ కల్యాణ్ ట్వీట్ కు స్పందించిన కేటీఆర్ థ్యాంకూ చెబుతూ రీట్విట్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..