Medaram Jathara : సీఎం కేసీఆర్ రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర జోస్యం చెప్పిన కోయ దొరలు

|

Feb 17, 2022 | 7:55 PM

సీఎం కేసీఆర్ రాష్ట్రం నుంచి దేశం వరకూ తన రాజకీయ ప్రస్తానం కొనసాగిస్తారా? ఒక వేళ కేసీఆర్ గానీ స్టేట్ వదిలి సెంట్రల్ కి వెళ్తే- ఆయన గెలుస్తారా? ఎంతో ప్రాముఖ్యత ఉన్న మేడారం జాతరకొచ్చే కోయ దొరలు ఏమంటున్నారు. 

Medaram Jathara : సీఎం కేసీఆర్ రాజకీయ భవితవ్యంపై ఆసక్తికర జోస్యం చెప్పిన కోయ దొరలు
Koya Doralu
Follow us on

Telangana:తెలంగాణ కుంభమేళా, మేడారం మహాజాతర కన్నుల పండుగగా జరుగుతుంది. ధీరత్వమే దైవత్వంగా మారిన చారిత్రక సత్యం. అంతుచిక్కని రహస్యానికి రమణీయ దృశ్యకావ్యం. అడవి తల్లుల దీవెనకు ప్రతిరూపం. వనదేవతల అడుగుజాడలకు ఉప్పొంగే జన ప్రవాహం. మనసులోని కోర్కెలను తీర్చి మళ్లీమళ్లీ రప్పించే శక్తి స్వరూపం. నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర బుధవారం నుంచి మొదలయ్యింది.  ప్రతి రోజూ లక్షల్లో భక్తులు అమ్మవార్ల ఆశీస్సులు అందుకుని వెళుతున్నారు.  దక్షిణాసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా .. తెలంగాణ కుంభమేళాగా పేరొందిన జాతరలో పూజా విధానమంతా ఆదివాసీ గిరిజన సంప్రదాయంలో జరుగుతుంది. మేడారంలో వెలసిన అద్భుత మహిమ గల దేవతలుగా భక్తులు భావించే సమ్మక్క, సారలమ్మలు విగ్రహాల రూపంలో ఉండరు. గుడి గోపురాలు ఉండవు. పూజా పురస్కారాలు ఉండవు. స్థిరమైన దేవతల ప్రతిమలు లేవీ ఉండవు. ఇవి వెదురు దుంగలతో సాక్షాత్కరించే వన ప్రతిమలు. సాంప్రదాయ కోయ గిరిజన పూజలతో జాతర జరుగుతుంది. పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరికాయలు, అడవిపూలతో కోయ తెగ వడ్డెలు దేవతలనే ప్రకృతి దేవతలుగా పూజిస్తారు.  కాగా మేడారం జాతరకే ప్రత్యేకం కోయ జ్యోతిష్యాలు. తాజాగా కోయ దొరలు సీఎం కేసీఆర్(CM Kcr) రాజకీయ భవితవ్యం గురించి జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణిస్తారని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తే ఆయనకంతా శుభమే అని చెప్పుకొచ్చారు. కరోనా ఈ జాతర తర్వాత నశిస్తుందని పేర్కొన్నారు. ఇంకా కోయ దొరలు చెప్పిన ఆసక్తికర జోస్యాన్ని దిగువన వీడియోలో వీక్షించండి.

Also Read: Tirumala: ప్రధాని నుంచి సామాన్యుడి వరకు అందరికీ ఒకే రకమైన భోజనం.. టీటీడీ సంచలన నిర్ణయం

కారంపొడి, పచ్చి మిర్చి రెండింటిలో ఏది బెటర్.. ఈ విషయాలు మీరు అస్సలు నమ్మలేరు