Telangana: ఆదర్శంగా నిలిచిన‌ కొమురంభీమ్ ఆసిపాబాద్ జిల్లా కలెక్టర్.. ఏం చేశారో తెలుసా..?

| Edited By: Balaraju Goud

Aug 27, 2024 | 7:02 PM

ప్రతిష్టాత్మకమైన పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు లక్షలు వెచ్చిస్తుంటారు. ఇలాంటి తరుణంలో కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ తమ కుమార్తెను తన నివాసానికి సమీపంలోనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

Telangana: ఆదర్శంగా నిలిచిన‌ కొమురంభీమ్ ఆసిపాబాద్ జిల్లా కలెక్టర్.. ఏం చేశారో తెలుసా..?
Collector's Daughter In Anganwadi Centre
Follow us on

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాలని ఆశపడతారు. ప్రతిష్టాత్మకమైన పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు లక్షలు వెచ్చిస్తుంటారు. ఇలాంటి తరుణంలో కొమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా కలెక్టర్ తమ కుమార్తెను తన నివాసానికి సమీపంలోనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు.

అంగన్‌వాడీ సెంటర్‌లో తన మూడేళ్ల కూతురును చేర్పించి ప్రభుత్వ విద్యావ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నారు ఆ కలెక్టర్ దంపతులు. అనుకున్నదే తడువుగా తమ మూడేళ్ల కూతురుని అంగన్‌వాడీకి పంపించి ఆదర్శంగా నిలిచారు.

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దొత్రే ఆదర్శంగా నిలిచారు. విద్య అందరికి అందాలని.. పేద ధనిక తేడా లేకుండా విద్య సాగాలని, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను కూడా ప్రభుత్వ బడిలోనే చదివించి ప్రభుత్వ పాఠశాలలపై సమాజంలో నమ్మకాన్ని పెంచాలనే సంకల్పంతో.. తమ మూడేళ్ల కూతురు స్వరను అంగన్‌వాడీ కేంద్రానికి పంపి ఆదర్శంగా నిల్చారు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు.

అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలతో కూర్చుని ఆట వస్తువులతో ఆడుకుంటూ అంగన్‌వాడీ కేంద్రంలో వండిన భోజనం చేసి భళా అనిపించారు. కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలే మిన్నా అనే అక్షర సత్యాన్ని నిజం చేయాలన్న సంకల్పంతోనే తమ కూతురును అంగన్‌వాడీ కేంద్రానికి పంపించామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో శిశువులకు ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలని, పిల్లలకు ఉపాద్యాయులు, ఆయాల సేవలు ఆదర్శం అని కొనియాడారు కలెక్టర్ దంపతులు. సామాన్యులు సైతం తమ పిల్లలను నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలంటూ కార్పొరేట్ పాఠశాలకు‌ పంపిస్తున్న ఈ కాలంలో తమ కూతురిని అంగన్‌వాడీకి పంపించి శభాష్ అనిపించుకున్నారు జిల్లా కలెక్టర్.

వీడియో చూడండి…

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..