Telangana BJP: మునుగోడులో బీజేపీ ఎక్కడ లెక్కలు తప్పింది.. రాజగోపాల్ ఓటమికి కారణాలు అవేనా..?

|

Nov 07, 2022 | 6:47 PM

మునుగోడు మాదేనన్నారు.. గెలుపుతో ప్రభుత్వం పడిపోతుందన్నారు.. అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్‌ అన్నారు.. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మునుగోడులో బీజేపీని ముంచేసిందా? టీఆర్‌ఎస్‌ వ్యూహాలను తక్కువగా అంచనా వేశారా? కమలం కకావికలం వెనుక కారణాలేంటి?

Telangana BJP: మునుగోడులో బీజేపీ ఎక్కడ లెక్కలు తప్పింది.. రాజగోపాల్ ఓటమికి కారణాలు అవేనా..?
Telangana BJP
Follow us on

మునుగోడు మాదేనన్నారు.. గెలుపుతో ప్రభుత్వం పడిపోతుందన్నారు.. అసెంబ్లీ ఎన్నికలకు బూస్టింగ్‌ అన్నారు.. ఆ ఓవర్ కాన్ఫిడెన్సే మునుగోడులో బీజేపీని ముంచేసిందా? టీఆర్‌ఎస్‌ వ్యూహాలను తక్కువగా అంచనా వేశారా? కమలం కకావికలం వెనుక కారణాలేంటి?

మునుగోడులో గెలిచి టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చాటాలని భావించింది బీజేపీ. అదే జోష్‌తో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని లెక్కలేసుకుంది. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. గులాబీ గుబాళింపు ముందు కమలం వాడిపోయింది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ (Rajgopal Reddy) రాజీనామా నుంచి మునుగోడు నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో బీజేపీ దృష్టి పెట్టకపోవడం పెద్ద మైనస్‌గా మారిందన్న అభిప్రాయాలున్నాయి. చౌటుప్పల్, చండూరు మున్సిపాల్టీలు.. మునుగోడు (Munugode Bypoll) మండలాల్లో మెజార్టీ వస్తుందని ఆశించి బీజేపీ భంగపడింది. రాజగోపాల్ నిర్ణయాలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి.. పార్టీ కేంద్రంగా నిర్ణయాలు తీసుకోకపోవడం ఓటమికి కారణమని భావిస్తున్నారు.

వివేక్ వెంకటస్వామికి ఇంఛార్జ్ బాధ్యతలు – నేతల మధ్య కనిపించని సమన్వయం

దుబ్బాక హుజూరాబాద్ ఎన్నికలను సక్రమంగా నిర్వహించిన ఇంఛార్జ్‌ జితేందర్ రెడ్డిని కాదని రాజగోపాల్ రెడ్డి అడిగిన వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగించారు. వివేక్ వెంకటస్వామి సమన్వయం కన్నా.. ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం కలిసి రాలేదని తెలుస్తోంది. ప్రచారంలో నేతల మధ్య కో ఆర్డినేషన్ లేకపోవడం పార్టీని ముంచింది. పలువురు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత తగాదాలు ప్రచారంపై ప్రభావం చూపించాయి. మునుగోడు స్టీరింగ్ కమిటీ ఛైర్మన్‌గా వివేక్… స్ట్రాటజీని అమలు చేయడంలో విఫలమయ్యారని పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హుజురాబాద్, దుబ్బాకలో ప్రచారం చేసినంత ఇక్కడ చేయకపోవడం కూడా బీజేపీకి మైనస్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

పోల్ మేనేజ్‌మెంట్‌లో వెనుకబడ్డ బీజేపీ – వెంట వచ్చిన వారినే నమ్మిన రాజగోపాల్‌

ఎన్నికల ముందు పోల్ మేనేజ్‌మెంట్‌లో టిఆర్ఎస్ పై బీజేపీ పై చేయి సాధించింది. ప్రచారం గడువు సమీపించే కొద్ది బీజేపీ పోల్ మేనేజ్మెంట్‌లో పూర్తిగా విఫలమైనట్టుగానే కనిపించింది. టీఆర్ఎస్ పార్టీ తరఫున అగ్ర నాయకత్వం ప్రతీ గ్రామాన్ని మైక్రో మేనేజ్ చేశారు. కానీ బీజేపీ నుంచి అలాంటి ఎఫర్ట్ కనిపించలేదు. రాజగోపాల్ రెడ్డి తనతో పాటు వచ్చిన కాంగ్రెస్ నాయకులను మాత్రమే నమ్మడం.. ఉన్న బీజేపీ నాయకులను పూర్తిగా వదిలేయడంతో వాళ్లంతా టిఆర్ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన మనోహర్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి పట్టించుకోకపోవడం మరో కారణమన్న టాక్‌ ఉంది. రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్ట్ ఆరోపణలు బలంగా తిప్పికొట్టలేక పోవడం అతి పెద్ద మైనస్‌గా కనిపిస్తోంది.

సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో కమ్యూనిస్టులతో దోస్తీ కట్టడం కారుకు బాగా కలిసొచ్చింది. నిజానికి విజయంలో వాళ్లదే కీ రోల్ అని చెప్పాలి. బీజేపీ మాత్రం కాంగ్రెస్‌తో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిస్థాయిలో చీల్చలేక చతికిలబడిపోయింది. విజయానికి పదివేల ఓట్ల దూరంలోనే ఆగిపోయింది.

తెలంగాణ వార్తల కోసం..