Khammam: విద్యార్థుల మనసు మెచ్చిన మాస్టారు.. వేరే స్కూల్‌కి వెళ్తుంటే కన్నీరు ఆపుకోలేకపోయారు
తమకు నచ్చిన ఉపాధ్యాయుడిని స్టూడెంట్స్ తమ జీవితంలో ఎప్పటికీ మరచిపోరు. అంతేకాదు తమకు ఇష్టమైన టీచర్ తమని వదిలి వెళ్తుంటే.. కన్నీరుమున్నీరుగా విలపిస్తారు.. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇటువంటి ఘటన చొటు చేసుకుంది.
పిల్లలు దేవుడితో సమానం అంటారు పెద్దలు.. తమని కొంచెం కేరింగ్ గా చూస్తే చాలు వారిపై అంతులేని ప్రేమని కురిపిస్తారు. అనుబంధాన్ని పెంచుకుంటారు. కల్లాకపటం తెలియని బాల్యంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులను చేరదీసి.. మంచి విద్యని అందిస్తే.. అటువంటి ఉపాధ్యాయుడిని ఆ స్టూడెంట్స్ తమ జీవితంలో ఎప్పటికీ మరచిపోరు. అంతేకాదు తమకు ఇష్టమైన టీచర్ తమని వదిలి వెళ్తుంటే.. కన్నీరుమున్నీరుగా విలపిస్తారు.. తాజాగా ఖమ్మం జిల్లాలో ఇటువంటి ఘటన చొటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఆశ్రమ పాఠశాలకు చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు సంవత్సరం కాలంగా డిప్యూటేషన్ పై స్కూల్ కి వచ్చారు. ఈ సంవత్సరం కాలంలోనే విద్యార్థినిల పట్ల శ్రద్ద తీసుకుంటూ.. మంచి విద్య బోధనలు అందిస్తూ మంచి ఫలితాలు సాధించారు. ఈ విషయంలో పలువురు ఆయన్ని ప్రశంసించారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పాఠశాలలో మెనూ సక్రమంగా పాటించట్లేదని పిల్లలు చేసిన ఆందోళనకు ఆయన మద్దతుగా నిలిచారు . అంతేకాదు పాఠశాలలో నూటికి నూరు శాతం ప్రవేశాలు పొందేలా చూశారు. డిప్యూటేషన్ పై వచ్చిన సంవత్సరంలోనే ఆశ్రమ పాఠశాలల రూపురేఖలే మార్చిన ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు మరల తన స్కూల్ కి వెళ్తున్నారు.
ఈ క్రమంలో మీరు ఇక్కడే ఉండాలి అంటూ విద్యార్థినిలు విలపిస్తూ అడ్డుకున్నారు. మీరే మా దేవుడు అంటూ మాకు మంచి విద్యాబోధన నేర్పించిన మాస్టారు ఇక్కడి నుంచి వెళ్లొద్దు అంటూ మిన్నంటే రోదనలతో చేతులెత్తి దండం పెడుతూ గేటు వైపు వెళ్లకుండా అడ్డుకున్నారు విద్యార్థినులు. విద్యార్థినులు కన్నీటిపర్వంతమయ్యారు. ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు విద్యార్థినులకు చేతులు జోడిస్తూ వెళ్లక తప్పదు అమ్మ అంటూ భారంగా నిష్క్రమించారు ప్రధానోపాధ్యాయుడు. స్టూడెంట్స్ హెడ్ మాస్టర్ బంధం అక్కడ ఉన్నవారిని సైతం కన్నీరు పెట్టించింది.
Reporter: Narayana rao
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడకు క్లిక్ చేయండి..