Hyderabad: ఆడాళ్లా మజాకా.! ఫ్రీ బస్సు జర్నీ విలువ తెలిస్తే మ్యాడైపోతారు

మహాలక్ష్మి పథకం మొదటగా ప్రారంభించిన స్కీం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ప్రారంభించి ఈరోజుతో రెండు ఏళ్ళు పూర్తయింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి.. 8459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందగలిగారు.

Hyderabad: ఆడాళ్లా మజాకా.! ఫ్రీ బస్సు జర్నీ విలువ తెలిస్తే మ్యాడైపోతారు
Free Bus Journey

Edited By: Ravi Kiran

Updated on: Dec 09, 2025 | 1:02 PM

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకానికి మంచి క్రేజ్ వచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం రావడంతో ఉపాధి పనులు, శుభకార్యాలు, పుణ్యక్షేత్రాలు సందర్శనలు, ఆస్పత్రులకు ఎక్కువగా వెళ్లగలిగారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ప్రారంభమై ఈ రోజు తో రెండేళ్లు పూర్తయింది. రెండేళ్ల క్రితం సోనియాగాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహాలక్ష్మి పథకం మొదటగా ప్రారంభించిన స్కీం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ప్రారంభించి ఈరోజుతో రెండు ఏళ్ళు పూర్తయింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసి.. 8459 కోట్ల విలువైన ప్రయాణాన్ని ఉచితంగా పొందగలిగారు. ఉచిత బస్సు ద్వారా కుటుంబాల మధ్య బంధుత్వాలు పెరగడంతో పాటు ఇతర అవసరాలకు మహిళలు ఆడపిల్లలు ఖర్చు లేకుండా ప్రయాణం చేయగలరని ప్రభుత్వం భావిస్తుంది.

మహాలక్ష్మి పథకం ఆర్టిసి లో మహిళలకు రుస్తు ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహిళలకు, ఆర్టీసీ సిబ్బందికి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు బస్సులలో ప్రయాణం చేయడమే కాదు మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.