Munugode By Poll Result 2022: రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై బీజేపీ అనుమానాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

|

Nov 06, 2022 | 1:28 PM

ఫలితాల జాప్యంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించింది.

Munugode By Poll Result 2022: రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై బీజేపీ అనుమానాలు.. ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
Munugode By Poll counting results
Follow us on

మునుగోడు ఉప ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ అటుంచితే.. ఫలితాల విడుదలలో జాప్యం.. గందరగోళం సృష్టించింది.
తొలి మూడు రౌండ్ల వరకు వెంటవెంటనే వెలువడిన ఫలితాలు… ఆ తర్వాత ఒక్కసారిగా నిలిచిపోయాయి. గంట సేపైనా తదుపరి రౌండ్‌ ఫలితాలు విడుదల కాకపోవడంతో ఈసీ తీరుపై ప్రధాన పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మునుగోడు కౌంటింగ్ తీరుపై బీజేపీ సీరియస్ అయ్యింది. మునుగోడు ఉప ఎన్నికలో ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‎కు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఫోన్ చేశారు. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఎందుకు జరుగుతుందని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు ఎందుకు ఫలితాలు వెల్లడించడం లేదని సీఈవోను కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అప్రమత్తమైన సీఈవో కేంద్ర మంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే 4 రౌండ్ల ఫలితాలను అప్‎లోడ్ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో తీరుపై బీజేపీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వికాస్ రాజ్‌కు ఈటల రాజేందర్ సూచన..

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌తో ఫోన్లో మాట్లాడారు ఈటల రాజేందర్. ఫలితాలు వెల్లడించడంలో ఎందుకు ఆలస్యం అవుతుంది అని ప్రశ్నించారు. మునుగోడులో జరిగిన దాడులు, మద్యం పంపిణీ, డబ్బులు పంపిణీ అంతా ఎన్నికల కమిషన్ మీద రాంగ్ ఒపీనియన్ వచ్చింది. ఫలితాలు సక్రమంగా వెల్లడించండి. గెలుపు, ఓటములు సహజం కానీ మీ మీద మచ్చ తెచ్చుకోకుండా ఉండండని వికాస్ రాజ్‌కు సూచించారు ఈటల రాజేందర్.

ఫలితాల వెల్లడిలో ఆలస్యం పైన ఆగ్రహం-

మరో వైపు మంత్రి మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌండ్‌ల వారీగా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెల్లడి ఆలస్యం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ కేంద్రం నుంచి మీడియాకి అధికారులు లీకులు అందుతున్నాయన్న వార్తల పైన ఎలక్షన్ కమిషన్ స్పందించాలన్నారు. ప్రతి రౌండ్ కౌంటింగ్ పూర్తయిన తర్వాత వెంటనే అధికారులు మీడియాకి స్వయంగా వివరాలు తెలిపాలని డిమాండ్ చేశారు.

ఉప ఎన్నిక రద్దు చేయాలి..

మునుగోడు ఉప ఎన్నిక రద్దు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ డిమాండ్‌ చేశారు. బీజేపీ గెలిచేలా ఈవీఎంలు సెట్‌ చేశారని ఆరోపించారు.

ఫలితాల వెల్లడిపై మీడియా ప్రతినిధుల ధర్నా..

ఇదిలావుంటే ఫలితాల వివరాలను కౌంటింగ్ వివరాలను అధికారులు వెల్లడించడం లేదని కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా ప్రతినిధుల ధర్నాకు దిగారు. అధికారులు కౌంటింగ్ సంబంధించిన వివరాలను మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదిలావుంటే.. మునుగోడు బైపోల్ కౌంటింగ్‌పై గందరగోళానికి అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో అధికారులు సమాచారం ఇవ్వకపోవడంతో కన్ఫ్యూజన్‌ ఎక్కువైంది. ఒక్కోసారి ఒక్కోరకంగా కౌంటింగ్ లెక్కలు వెలువడటం కూడా ఈ రచ్చకు కారణమైంది. DPRO, EC అధికారులు ఇచ్చే సమాచారంలో తేడాలు కనిపించాయి. అయితే కౌంటింగ్‌లో సిబ్బందికి అనుభవం లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తినట్టు తెలుస్తోంది.

మరిన్ని మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల కోసం