TV9 Conclave: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు.. ప్రజలంతా బీజేపీని కోరుకుంటున్నారు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
Kishan Reddy in TV9 Conclave: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు.. తెలంగాణను బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌లా మార్చింది.. అంటూ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 18 నుంచి 35 ఏళ్ల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ కిషన్ రెడ్డి చెప్పారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై విమర్శించారు.
Kishan Reddy in TV9 Conclave: కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలు.. తెలంగాణను బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్‌లా మార్చింది.. అంటూ కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. 18 నుంచి 35 ఏళ్ల ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటూ కిషన్ రెడ్డి చెప్పారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల తీరుపై విమర్శించారు. ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయో.. ఆ అవసరాలను తీరుస్తామని.. దాని ప్రకారమే మేనిఫెస్టోను రూపొందించామని తెలిపారు. తెలంగాణలో ప్రజల నుంచి బీజేపీకి మంచి స్పందన వస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో విపరీతమైన అవినీతి ఉందని.. శాండ్, ల్యాండ్, లిక్కర్ దందా ఎక్కువైందని ప్రజలకు అర్థమైందన్నారు. అవినీతి రహిత పాలనే తమ విధానమని.. గ్రామీణ ప్రాంతాల్లోని యువత బీజేపీ వైపే చూస్తుందన్నారు.
సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు కూడా బీఆర్ఎస్‌కు ఓటు వెయ్యబోరని చెప్పారు కిషన్ రెడ్డి. ఆత్మగౌరవ తెలంగాణను.. బానిస లెక్క మారుస్తామంటే ప్రజలెవ్వరూ ఒప్పుకోరన్నారు. బీజేపీ వచ్చాక దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని.. ఆ అభివృద్ధిని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వివరించారు. తెలంగాణలో ఉద్యమాకారుల ఆకాంక్షలు నెరవేరలేదని.. అవి నెరవేరాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అధ్యక్ష పదవి గురించి కూడా కిషన్ రెడ్డి స్పందించారు.. తాను మూడు సార్లు అధ్యక్షుడిగా పనిచేశానని.. పార్టీ ఏ పదవి ఇస్తే.. దానిని చేపట్టానంటూ క్లారిటీ ఇచ్చారు.
బీసీ ముఖ్యమంత్రిని చేయడమే పార్టీ విధానమని.. తాను ఎన్నికల్లో పోటీలో ఉంటే తప్పుడు సంకేతాలు వెళతాయంటూ కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం అప్పులు చేస్తే తప్ప తెలంగాణలో ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదన్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో చాలా మార్పులు వచ్చాయంటూ తెలిపారు. ఉచిత పథకాలపై బీజేపీకి స్పష్టమైన విధానం ఉందన్నారు. దేశంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని.. ఒకప్పుడు కాశ్మీర్ ఎలా ఉందని.. ఇప్పుడు ఎలా ఉందని ప్రశ్నించారు. ఒకప్పుడు కాశ్మీర్ యువత భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసేదని.. ఇప్పుడు ఆ యువత చేతుల్లో కంప్యూటర్ లు ఉన్నాయంటూ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..