Kinnera player Mogilaiah: ఆర్టీసీ బస్సు తల్లిలాంటిది.. మొగులయ్య పాటను షేర్ చేసిన సజ్జనార్..

| Edited By: Ravi Kiran

Nov 22, 2021 | 12:17 PM

ఆర్టీసీ బస్సు తల్లిలాంటిదని ప్రశంసలతో ముంచేశారు కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య.  ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ..

Kinnera player Mogilaiah: ఆర్టీసీ బస్సు తల్లిలాంటిది.. మొగులయ్య పాటను షేర్ చేసిన సజ్జనార్..
Kinnera Player Mogilaiah
Follow us on

Kinnera player Mogilaiah – TS RTC: ఆర్టీసీ బస్సు తల్లిలాంటిదని ప్రశంసలతో ముంచేశారు కిన్నెర వాయిద్యకారుడు మొగులయ్య.  ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ సేవలను ప్రశంసిస్తూ ఆయన పాట ఆలపించారు. బస్సులో ప్రయాణం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చిందని.. ఆర్టీసీ ఇస్తున్న సేవలను ఆయన అభినందించారు. తన కూతురు పెళ్లికి ఇటీవల ఆర్టీసీ బస్సును బుక్‌ చేసుకున్నారు. ఆర్టీసీ అందించిన సేవలకు సంతోషం వ్యక్తంచేస్తూ తాను అద్దెకు తీసుకున్న బస్సు ముందు తనదైన శైలిలో కిన్నెరతో పాటను ఆలపించారు.

బుక్‌ చేసిన గంటలోనే బస్సు వచ్చిందని.. ఆర్టీసీ బస్సులో ప్రయాణం చెప్పలేనంత ఆనందాన్ని  కలిగించిందని పాట రూపంలో పాడారు. పెండ్లికి సురక్షితంగా వెళ్లి వచ్చామని ఆలపించారు. అది ఆర్టీసీ బస్సు కాదని.. తల్లిలాంటిదని కొనియాడారు.

ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం చేయాలని ప్రజలకు సూచించారు. దీంతో మొగులయ్యను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ శభాష్‌ అని మెచ్చుకున్నారు. ఇటీవల పవన్‌ కల్యాణ్‌ సినిమాలో ఆయన పాడిన బీమ్లానాయక్‌ పాట అందర్నీ ఆకర్షించిన విషయం తెలిసిందే.

పల్లె ఒడే సంగీత బడిగా సాగుతున్న సాటిలేని విద్వాంసుడు. తెలంగాణ మట్టినే మనసుగా చేసుకున్న పాటగాడు. అలనాటి వీరగాధలకు తన గొంతును అంకితమిచ్చిన నిస్వార్థ కళాకారుడు దర్శనం మొగిలయ్య.

12 మెట్ల కిన్నెర.. పల్లె వాగ్గేయకారుడు మొగిలయ్య మానస పుత్రిక. అరుదైన కళను.. రాగాలను కాపాడుకుంటూ వస్తున్న మొగిలయ్య సంగీత సరస్వతి కాష్టకం వుంది. కానీ బతుకు బాటలో ముందుకు సాగడమే కష్టంగా మారింది. ఐతేనేం ప్రతిభకు ఏది ప్రతిబంధకంకాదు. మొగిలయ్యను వెదుక్కుంటూ ఓ అద్భుత అవకాశం వచ్చింది. అక్కడో ఇక్కడో కాదు.. ఆడగాదు ఈడగాదు అంటూ బీమ్లానాయక్‌ సూపర్‌ హిట్‌ టాక్‌కు బీప్‌గా మారాయి మొగులయ్య సరాగాలు. పవర స్టార్‌ స్టెప్‌కు కిన్నెర సరాగాలు తోడయితే.. ఇక రీసౌండ్‌ చెప్పతరమా.

ఇవి కూడా చదవండి: How to Clean: మీ ఇంట్లోని ఫ్రిజ్‌ అలా ఉంటే రోగాల బారిన పడినట్లే.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేయండి..

Net Banking Fraud: నెట్ బ్యాంకింగ్ చేసేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి