AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యో దేవుడా.. పాఠాలు చెబుతూనే కుప్పకూలిన టీచర్.. ధైర్యం ఉన్నోళ్లే చూడండి..

ఖమ్మంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంగ్లీష్ టీచర్ గారపాటి జయరాజు పాఠం చెబుతుండగా గుండెపోటుతో అకస్మాత్తుగా మరణించారు. క్లాస్‌రూంలో కుప్పకూలిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో వైరల్ కావడంతో తీవ్ర చర్చనీయాంశమైంది. జయరాజు మృతితో కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. అకస్మిక మరణాలపై ఆందోళన పెరుగుతోంది.

అయ్యో దేవుడా.. పాఠాలు చెబుతూనే కుప్పకూలిన టీచర్.. ధైర్యం ఉన్నోళ్లే చూడండి..
Heart Attack Death
N Narayana Rao
| Edited By: |

Updated on: May 09, 2026 | 6:16 PM

Share

గుండెపోటు ప్రాణాలు తీస్తోంది.. తాజాగా.. ఓ ఇంగ్లీష్ టీచర్ పాఠాలు చెబుతూనే కుప్పకూలి చనిపోవడం కలకలం రేపింది. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది. గారపాటి జయరాజు అనే ఇంగ్లీష్ టీచర్ ఒక్కసారిగా క్లాస్ రూంలోనే కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. మధిరకు చెందిన ఇంగ్లీష్ టీచర్ గారపాటి జయరాజు ఆకస్మిక మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రస్తుతం ఖమ్మం మమతా రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ ఒలింపియాడ్ క్యాంపస్‌లో జయరాజు పని చేస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనా విధానాల్లో మెళకువలు నేర్పిస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అప్పటి వరకు జయరాజు సహచర ఉపాధ్యాయులతో కలివిడిగా ఉంటూ క్లాస్ చెబుతూనే కుప్పకూలారు.

అయితే.. ఈ సమయంలో ఒక్కసారిగా షాక్ కు గురైన అక్కడున్న వారు.. అతన్ని లేపే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆయన పూర్తిగా స్పృహకోల్పోయారు. పరీక్షించి ఆయన చనిపోయినట్లు నిర్దారించడంతో దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

వీడియో చూడండి..

జయరాజు గుండెపోటుతో మరణించడంతో.. ఆయన కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు కన్నీంటిపర్యంతమయ్యారు. ఈ ఘటనలో మధిరలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us