టార్గెట్ ఫిక్స్.. తెలంగాణలో రెండు రోజుల్లో కీలక పరిణామం.. అదేంటంటే..?

తెలంగాణలో మరో రెండు రోజుల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజుల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మావోయిస్టు ఏరివేతనే ప్రధాన లక్ష్యంగా బలగాలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో టార్గెట్‌ను పూర్తిచేయాలని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

టార్గెట్ ఫిక్స్.. తెలంగాణలో రెండు రోజుల్లో కీలక పరిణామం.. అదేంటంటే..?
Telangana Police (file)

Edited By: Balaraju Goud

Updated on: Nov 20, 2025 | 12:34 PM

తెలంగాణలో మరో రెండు రోజుల్లో కీలక పరిణామం చోటుచేసుకోబోతుంది. దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత తారా స్థాయికి చేరుకున్న నేపథ్యంలో తెలంగాణలో రెండు రోజుల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. మావోయిస్టు ఏరివేతనే ప్రధాన లక్ష్యంగా బలగాలు పనిచేస్తున్నాయి.

వచ్చే మార్చి నాటికి మావోయిస్టు లేకుండా చేస్తామన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాటలు నిజం కావటానికి దగ్గర పడే సమయం ఆసన్నమైంది. ఈ తరుణంలో నవంబర్ 28న ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా అన్ని రాష్ట్రాల డీజీపీలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మావోస్టులప ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో టార్గెట్‌ను పూర్తిచేయాలని నిఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇందులో భాగంగా మావోయిస్టు లొంగుబాట్లలో తెలంగాణ SIB తమ టార్గెట్ ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. రెండు రోజుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా ఉన్న కీలక నేతలు తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోనున్నట్లు తెలుస్తోంది. మల్ల రాజిరెడ్డి, ఆజాద్, దామోదర్ వంటి అగ్రనేతలు అడవిని వదిలి జనజీవన స్రవంతిలో కలవనున్నట్లు సమాచారం. మరోవైపు మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ కోసం ఏపీ పోలీసులు ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతడు లక్ష్యంగానే ఏపీలో ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దేవ్ జీ సైతం తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయే అవకాశం కనిపిస్తుంది.

ఒకవేళ అదే జరిగితే తెలంగాణ పోలీసులు రికార్డు సృష్టించినట్టే..! ఇప్పటికే దేశవ్యాప్తంగా మావోయిస్టు లొంగుబాటులో సంఖ్యాపరంగా తెలంగాణ పోలీసులు ముందు ఉన్నారు. తెలంగాణ పోలీసుల ముందే వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. ఇక దేవ్ జీ కూడా తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోతే అమిత్ షా మాటలు నిజమైనట్టుగానే భావించాలి.

మావోయిస్టు పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణతో ముడి పడి ఉంది. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే కేంద్ర కమిటీ సభ్యుల్లో ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే మల్లోజుల వేణుగోపాల్‌తో పాటు చంద్రన్న లాంటి అగ్రనేతలు అరణ్యాన్ని వదిలి జనారణ్యంలో కలిశారు. ఇక మిగిలిన వారిని కూడా లొంగిపోయేలా తెలంగాణ పోలీసులు వ్యూహాలు రచిస్తున్నారు. ఈ లొంగుబాటు చర్యలను ఛత్తీస్‌గఢ్ లో జరగనున్న డీజీపీ కాన్ఫరెన్స్ లోపే పూర్తి చేయాలని తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..