Telangana: ఉద్యోగుల పదవి విరమణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇదిగో క్లారిటీ

ఉద్యోగుల వయోపరిమితి కొత్త విధానంపై వచ్చిన వార్తలపై తెలంగాణ సర్కార్‌ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమి చేయలేదని తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణలో కొత్త నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలు ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఇదిలా ఉండగా, 33 ఏళ్ల సర్వీస్‌ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే

Telangana: ఉద్యోగుల పదవి విరమణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇదిగో క్లారిటీ
Cm Revanth Reddy

Updated on: Apr 12, 2024 | 8:08 PM

ఉద్యోగుల వయోపరిమితి కొత్త విధానంపై వచ్చిన వార్తలపై తెలంగాణ సర్కార్‌ స్పందించింది. ఇప్పటి వరకు అలాంటి ప్రకటనలేమి చేయలేదని తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణలో కొత్త నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలు ప్రభుత్వానికి లేదని తెలిపింది. ఇదిలా ఉండగా, ఉద్యోగుల పదవి విరమణ 33 ఏళ్ల సర్వీస్‌ నిబంధన లేదా 61 ఏళ్ల వయో పరిమితిలో ఏది ముందైతే అదే అమలు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లు, ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పదవీ విరమణ నిబంధనలపై నిర్ణయం తీసుకుంటామని సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.  ఇలాంటి రూమర్స్ ను ప్రభుత్వం కొట్టి పారేంది. ఉద్యోగుల పదవీ విరమణ నిబంధనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఉద్యోగుల వయోపరిమితి కొత్త విధానం పై ప్రభుత్వం ఎలాంటి ఆలోచనలు లేదని తెలిపింది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి