Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు.. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటన.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును చెరిపేస్తోందని.. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ కిట్‌ నుంచి ఆయన గుర్తు తొలగించినా.. తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరంటూ హరీష్‌రావు పేర్కొన్నారు.

Harish Rao: ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు.. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటన.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao KCR
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 06, 2024 | 3:02 PM

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే జిల్లాల పర్యటనలు ఉంటాయని మాజీ మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు. కేసీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పార్లమెంట్‌ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో పాల్గొన్న హారీష్ రావు.. నియోజకవర్గ పరిధిలోని బీఆర్ఎస్ నేతలకు పలు సూచనలు చేశారు. ఎలాగైనా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అహర్నిషలు పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..కేసీఆర్‌ కోలుకుంటున్నారని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రజల మధ్యలోకి వస్తారన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కి వచ్చి ప్రతీ రోజూ కార్యకర్తలను కలుస్తారని.. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్ మీద కేసీఆర్ గుర్తును చెరిపేస్తోందని.. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నారంటూ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ కిట్‌ నుంచి ఆయన గుర్తు తొలగించినా.. తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరంటూ హరీష్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రద్దు చేస్తున్నారని.. కాంగ్రెస్‌ విపరీత చర్యలపై ఉద్యమిస్తామని పేర్కొ్న్నారు. ఈ ప్రభుత్వతీరు చూస్తే ఏడాదిలోనే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే..అసలు కథ ముందుంది.. అంటూ హరీష్‌రావు పేర్కొన్నారు.

వీడియో చూడండి..

బీఆర్ఎస్ కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగితే ఎమ్మెల్యేమంతా బస్సు పట్టుకుని బాధితుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని.. తెలంగాణ కోసం ఉద్యమంలో రాజీనామాలు చేశాం తప్ప రాజీ పడలేదని గుర్తుచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..