KCR: కేసీఆర్ పొలంబాట.. రైతులను పరామర్శించనున్న బీఆర్ఎస్ బాస్.. ఫుల్ షెడ్యూల్ ఇదే..

|

Mar 31, 2024 | 10:52 AM

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నేటి నుంచి పొలంబాట పట్టనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు చవిచూసిన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆయన రైతన్నల పరామర్శలు మొదలుపెట్టనున్నారు. తెలంగాణలో అకాల వర్షాలతో పాటు, నీరు అందక పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌..

KCR: కేసీఆర్ పొలంబాట.. రైతులను పరామర్శించనున్న బీఆర్ఎస్ బాస్.. ఫుల్ షెడ్యూల్ ఇదే..
Kcr
Follow us on

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ నేటి నుంచి పొలంబాట పట్టనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు చవిచూసిన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆయన రైతన్నల పరామర్శలు మొదలుపెట్టనున్నారు. తెలంగాణలో అకాల వర్షాలతో పాటు, నీరు అందక పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌.. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. ఉదయం పదిన్నరకు జనగామ జిల్లాలోని దేవరుప్పుల మండలం దారవత్ తండాలో, పదకొండున్నరకు సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లిలో ఎండి పోయిన పంటల పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు సూర్యాపేటలో మీడియా సమావేశం నిర్వహిస్తారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశముంది. పంట నష్టపోయిన అన్నదాతలకు తగిన పరిహారం చెల్లించాలని కూడా కేసీఆర్‌ డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. మీడియా సమావేశం తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటలకు నల్గొండ జిల్లాలోని నిడమనూర్ మండలంలో ఎండి పోయిన పంటలను పరిశీలిస్తారు. రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్‌ తిరిగి చేరుకుంటారు కేసీఆర్..

అయితే జిల్లాకు ఏం చేశారో చెప్పి రావాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామేలు డిమాండ్‌ చేశారు. నియోజకవర్గానికి వచ్చేముందు ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

లోక్‌సభ ఎన్నికల వేళ కేసీఆర్ పొలంబాట రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశముంది. పొలంబాటతో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడంతో పాటు రైతాంగానికి దగ్గరయ్యేందుకు యోచిస్తోంది బీఆర్‌ఎస్‌. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకుంది. దీంతో జిల్లాపై ఫోకస్‌ చేసింది బీఆర్‌ఎస్‌..

మరిన్ిన తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..