KCR Cricket Trophy final: కేసీఆర్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఎమ్‌సీసీ జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి సిద్ధిపేట స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఎమ్‌సీసీ 36 పరుగుల తేడాతో ఇండియన్ ఎలెవెన్ జట్టుపై విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత ఎమ్‌సీసీ నిర్ణీత 10 ఓవర్లలో 100 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఇండియన్ ఎలెవన్ 64 పరుగులకే ఆలౌటైంది. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్ విజేతలకు బహుమతులు అందజేశారు.
#KCRCricketTrophy #HappyBirthdayKCR @azharflicks https://t.co/JsE6p9bQQa
— Harish Rao Thanneeru (@trsharish) February 17, 2021
టైటిల్ విన్నర్ ఎమ్‌సీసీకి రూ.లక్ష రూపాయల నగదు బహుమతితోపాటు ట్రోపీ దక్కగా, రన్నరప్‌కు 50వేల బహుమతి లభించింది. ఎమ్‌సీసీ ప్లేయర్ అఫ్రిదీకి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’, గోర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు హరీష్ రావు, అజారుద్దీన్ క్రికెట్ ఆడి సందడి చేశారు. గత పదిరోజులుగా మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో జరిగిన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాంది మంది క్రీడాభిమానులు తరలివచ్చారు. దీంతో స్టేడియం కిక్కిరిసిపోయింది.
#KCRCricketTrophy @azharflicks https://t.co/vZhkXGxH5m
— Harish Rao Thanneeru (@trsharish) February 17, 2021
Also Read: