మనసు మెలిపెట్టే కథనం: విథి విడదీసింది.. మృత్యువు కలిపింది!

| Edited By: Srilakshmi C

Aug 01, 2023 | 12:31 PM

ఈ కుక్క.. ఇంట్లో ఓ కుటుంబ సభ్యురాలు.. అంతేకాదు... ఈ వృద్ధదంపతులకు... కొడుకు కంటే ఎక్కువ. దీంతో 9 యేళ్లుగా కుక్కను పోషిస్తున్నారు. ఇంటి ఆవరణలో ఎవరైనా వస్తే ఇంట్లోకి రానివ్వదు. అంతేకాదు నాలుగైదు సార్లు పాము కాటు నుంచి యాజమానిని తప్పించింది కూడా. పాముపై దాడి చేసి చంపింది. అయితే వారం రోజుల క్రితం ఇంటి యాజమాని తీవ్రమైన అనారోగ్యంతో కన్ను మూశారు. యాజమాని చనిపోయినప్పటి నుంచీ కుక్క ఆహారం తినడం మానేసింది. దీంతో కుక్క మౌనంగా రోదించింది. కుటుంబ సభ్యులు ఆహారం..

మనసు మెలిపెట్టే కథనం: విథి విడదీసింది.. మృత్యువు కలిపింది!
Venkataiah's Pet Dog
Follow us on

కరీంనగర్‌, ఆగస్టు 1: ఈ కుక్క.. ఇంట్లో ఓ కుటుంబ సభ్యురాలు.. అంతేకాదు… ఈ వృద్ధదంపతులకు… కొడుకు కంటే ఎక్కువ. దీంతో 9 యేళ్లుగా కుక్కను పోషిస్తున్నారు. ఇంటి ఆవరణలో ఎవరైనా వస్తే ఇంట్లోకి రానివ్వదు. అంతేకాదు నాలుగైదు సార్లు పాము కాటు నుంచి యాజమానిని తప్పించింది కూడా. పాముపై దాడి చేసి చంపింది. అయితే వారం రోజుల క్రితం ఇంటి యాజమాని తీవ్రమైన అనారోగ్యంతో కన్ను మూశారు. యాజమాని చనిపోయినప్పటి నుంచీ కుక్క ఆహారం తినడం మానేసింది. దీంతో కుక్క మౌనంగా రోదించింది. కుటుంబ సభ్యులు ఆహారం పెట్టేందుకు ప్రయత్నించినా తినలేదు. చివరకు తీవ్రమైన అనారోగ్యంతో కుక్క కూడా చనిపోయంది. యాజమాని చనిపోవడంతో ఆరు రోజుల్లోనే కుక్క కుక్క కూడా మృతి చెందిన ఘటన స్థానికంగా చర్చణీయాంశంగా మారింది. యాజమాని సమాది పక్కనే కుక్కు సమాది ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు.

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం పెర్కపల్లికి చెందిన పోతురాజు వెంకటయ్య 9 యేళ్ల నుంచీ కుక్కను పెంచుకున్నాడు. ఈయన ఇంటి వద్దనే ఉంటూ.. చిన్న, చిన్న పనులు చేసేవాడు. గెదె పాలు పితకడం, కోళ్లను పోషించడంతో పాటు ఇంటి ఆవరణ పనులు చేస్తుంటాడు. ఆయన పెంపుడు కుక్క పేరు టిప్పు. ఇంటి చుట్టు వివిధ మొక్కలు ఉండటంతో పాములు కూడా ఎక్కువగా సంచరించేవి. నాలుగైదు సార్లు పాములు ఇంట్లోకి వస్తే కుక్క అరిచి వాటిని వెళ్లిగొట్టింది. ప్రతి రోజు వెంకటయ్య మంచం కిందనే పడుకునేదీ. యజమాని రోజు అన్నం పెట్టేవాడు. కుక్క కూడా అతనిని కంటికి రెప్పాలా కాపాడుకునేది. ఎటైనా బయటకు వెళ్లే,. వెంకటయ్య వెంట కుక్క వెళ్లేదీ. అంతేకాదు, కోళ్లకు కూడా కాపాలాగా ఉండేది.

పిల్లులు వస్తే.. వాటిని బెదిరించి పంపేదీ. వెంకటయ్య కూడా కుక్కను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యతో బాధపడుతున్న వెంకయ్య ఎక్కువగానే ఇంట్లోనే ఉంటున్నారు. కుక్క కూడా ఇతని దగ్గర ఉండేది.  ఈక్రమంలో వారం రోజుల క్రితం వెంకటయ్య గుండెపోటుతో మరణించారు. ఇదే గ్రామంలో అంత్యక్రియలు చేశారు. అప్పుడు కుక్క గురించి కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. కానీ.. కుక్క అంత్యక్రియలు జరిగే ప్రాంతం దగ్గరికి వెళ్లి.. మళ్లీ ఇంటికి వచ్చింది. వెంకటయ్య చనిపోయిన నాటి నుంచీ… కుక్క బెంగతో ఆహారం తినడం మానేసింది. అంతేకాదు.. కంటి నుంచీ నీళ్లు కారుస్తూ మౌనంగా ఉండేది. కుటుంబ సభ్యులు.. ఆహారం పెట్టడానికి ప్రయత్నించినా తినలేదు. నోట్లో పెట్టినా తిన లేదు. కుటంబ సభ్యులు ఏడుస్తుంటే.. కుక్క కూడా ఏడ్చింది. వారం రోజులు అన్నం తినికపోవడంతో అనారోగ్యం బారీన పడి కుక్క కన్ను మూసింది. దీంతో కుటుంబ సభ్యులు.. కన్నీరు, మున్నీరుగా విలపించారు. వెంకటయ్య సమాది వద్ద.. కుక్క సమాది కట్టి నివాళులు అర్పించారు. తన యాజమాని చనిపోవడంతో తాను కూడా ఆహారం తీసుకోకుండా తనువు చాలించింది ఈ విశ్వాస జంతువు. వారం రోజుల్లో ఇంటి యాజమానితో పాటు కుక్క చనిపోవడంతో ఈ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.