కుక్కలను పట్టుకుంటే పైసలే.. పైసలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మున్సిపల్ అధికారులు..!

| Edited By: Balaraju Goud

Sep 06, 2024 | 3:32 PM

ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేదు, తెలంగాణ అంతటా కుక్కలు దడపుట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మొదలుకుని.. జిల్లాల వరకు ఎక్కడ చూసినా వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. దొరికినోళ్లను దొరికినట్టు కసితీరా కొరికేస్తున్నాయి.

కుక్కలను పట్టుకుంటే పైసలే.. పైసలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన మున్సిపల్ అధికారులు..!
Street Dogs Attack
Follow us on

ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనే తేడా లేదు, తెలంగాణ అంతటా కుక్కలు దడపుట్టిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని మొదలుకుని.. జిల్లాల వరకు ఎక్కడ చూసినా వీధికుక్కలు చెలరేగిపోతున్నాయి. దొరికినోళ్లను దొరికినట్టు కసితీరా కొరికేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు కనిపిస్తే చాలు.. పిచ్చిపట్టినట్టుగా ఎటాక్‌ చేసి చంపేస్తున్నాయి కూడా. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులను చూస్తుంటే… అసలవి వీధి కుక్కలా.. లేక వేట మృగాలా అనే డౌట్‌ వస్తోంది. పిల్లలు పెద్దలనే తేడా లేకుండా వెంటాడి వేటాడిమరీ దాడులు చేస్తున్నాయి. ఎవ్వరు కనబడినా వారి పై దాడులు చేస్తున్నాయి. తీవ్ర గాయలతో ఆసుపత్రి పాలవుతున్నారు.. ఈ క్రమం లో కుక్కలను పట్టుకునేందుకు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా కాంటాక్ట్ ఇచ్చింది.

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో, సమీప గ్రామాల్లో వీధి కుక్కల సంచారంపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. వాటిని పట్టుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కరీంనగర్‌లో సుమారు 10 వేల కుక్కలు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి రోజు పది కుక్కల వరకు పట్టుకుంటున్నారు. ఒక రోజుకి 10 నుండి 15 వీధి కుక్కలను పట్టుకుని వాటికి వైద్యం అందిస్తున్నారు. మగ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేపిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. ఆపరేషన్ చేసిన తర్వాత ఐదు రోజుల వరకు పశు వైద్య శాఖ వారి ఆధ్వర్యంలో అబ్జర్వేషన్ లో ఉంచుతున్నారు. ఏవైనా ఇతర రోగాలు ఉన్నట్లయితే వాటికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరినైనా కరిచిన ఎలాంటి అపాయం కలగకుండా ఉండేందుకు తగు వ్యాక్సినేషన్ ఇస్తున్నారు .వీధి కుక్కలను మళ్ళీ పట్టుకున్న చోటే వదిలేస్తున్నారు.

కరీంనగర్ మున్సిపల్ పరిధిలోని వీధి కుక్కలను పట్టుకునేందుకు ఒక స్వచ్ఛంద సేవా సంస్థ కాంట్రాక్టు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే ఒక్కో కుక్కను పట్టుకునేందుకు సుమారు 1,650 రూపాయలను చెల్లిస్తోంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. పట్టుకున్న ఆ కుక్కలను పశు వైద్యశాలలో వైద్యం అందిస్తున్నారు. వైద్యం అందించే ఆ ఐదు రోజులపాటు అయ్యే ఆహారం, వ్యాక్సినేషన్ ఖర్చులు పూర్తిగా ఈ NGO నే భరిస్తుంది. ముఖ్యంగా వీధి కుక్కలను పట్టుకొని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల పై ఫోకస్ పెట్టింది. వీలైనంత వరకు కుక్కల సంతానం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం.. కరీంనగర్ కార్పొరేషన్ లో కుక్కల కోసం వేట కొనసాగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..