Karimnagar: తల్లిదండ్రులు రాలేదని మనస్తాపంతో హాస్టల్ స్టూడెంట్ ఆత్మహత్య యత్నం.. విరిగిన కాళ్ళు

|

Feb 13, 2023 | 7:01 AM

తల్లిదండ్రులు రాలేదనే మనస్థాపంతో పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన బాలికకు చదువంటే ఇష్టం లేదనీ.. సరిగా స్కూలుకు వచ్చేది కాదని టీచర్లు చెప్తున్నారు

Karimnagar: తల్లిదండ్రులు రాలేదని మనస్తాపంతో హాస్టల్ స్టూడెంట్ ఆత్మహత్య యత్నం.. విరిగిన కాళ్ళు
Karimnagar Student
Follow us on

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు యత్నించింది. 10వ తరగతి చదువుతున్న హాసిని అనే బాలిక.. పాఠశాల భవనంపై నుంచి దూకింది. అక్కడే ఉన్న విద్యార్ధులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రులు రాలేదనే మనస్థాపంతో పాఠశాల మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించినట్టు స్థానికులు చెప్తున్నారు. ఆత్మహత్యకు యత్నించిన బాలికకు చదువంటే ఇష్టం లేదనీ.. సరిగా స్కూలుకు వచ్చేది కాదని టీచర్లు చెప్తున్నారు. ఐదు రోజుల క్రితమే స్కూలుకు వచ్చిందనీ.. వెళ్లిపోతానంటూ 3 రోజులుగా గొడవ చేస్తోందన్నారు. గతంలోనూ ఇలాగే గొడవ చేసి వెళ్లిపోయిందన్నారు.

ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశామంటోంది స్కూలు యాజమాన్యం. బుధవారం వస్తానని బాలిక తల్లి బదులు కూడా ఇచ్చింది. ఈలోపే భవనంపై నుంచి దూకేసిందా బాలిక. దుకుతున్న సమయంలో దుప్పట్లు పట్టి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ దుప్పటి చిరిగి కింద పడటంతో విద్యార్థిని కాలు విరిగింది. ముందుగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఇచ్చిన అనంతరం గాంధి ఆసుపత్రి కి తరలించారు. బాలికను ఆసుపత్రి లో పరామర్శించిన చొప్పదండి ఎమ్మెల్యే రవి శంకర్ పరామర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి