Kanha Music Fest: మూడు రోజుల తర్వాత మ్యుజిక్ ఫెస్టివల్ మొదలు.. నేడు తన గాత్రంతో అలరించనున్న ఉస్తాద్ రషీద్ ఖాన్

|

Feb 01, 2023 | 7:35 AM

రషీద్ ఖాన్ పాట పాడడం ప్రారంభిస్తే.. అక్కడ ప్రిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడుతుంది. అతని గాత్రానికి ప్రతి ఒక్కరూ మంత్రం ముగ్దులవుతారు. తన సంగీతంతో .. తన గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడిస్తారు ఉస్తాద్ రషీద్ ఖాన్. సంగీతకారుడు కావాలని కోరుకోలేదు. నిజానికి రషీద్ ఖాన్ మంచి క్రికెటర్‌ని కావాలనుకున్నారు.

Kanha Music Fest: మూడు రోజుల తర్వాత మ్యుజిక్ ఫెస్టివల్ మొదలు.. నేడు తన గాత్రంతో అలరించనున్న ఉస్తాద్ రషీద్ ఖాన్
Ustad Rashid Khan
Follow us on

హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతి వనంలో ఘనంగా ధ్యానం అదిగురువు లాలాజీ మహారాజ్ 150 జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. గత ఏడు రోజులుగా మ్యూజికల్ ఫెస్టివల్  అండ్ మెడిటేషన్ సెక్షన్స్ జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనడగానికి సుమారు 65 దేశాల నుంచి దాజీ ఫాలోవర్స్, ధ్యానం అభ్యాసకులు కన్హా శాంతి వనం చేరుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా మ్యూజికల్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నారు. మూడు రోజుల విరామం తర్వాత నేడు తిరిగి  మ్యూజికల్ ఫెస్టివల్ కార్యక్రమం ప్రారంభం కానున్నది.

ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు, హార్ట్ ఫుల్ నెస్ ఫౌండర్ పద్మభూషణ్ కమలేష్ పటేల్ (దాజీ ) ఆధ్వర్యంలో మెడిటేషన్ సెక్షన్ నిర్వహించనున్నారు. సాయంత్రం 5.30 గం. తరువాత మ్యూజికల్ ఫెస్టివల్ అనంతరం దాజీ నేతృత్వంలో సమూహ ధ్యాన కార్యక్రమం జరగనుంది. ఈ రోజు సాయంత్రం మ్యూజికల్ ఫెస్టివల్ లో ఉస్తాద్ రషీద్ ఖాన్ తన గాత్రంతో సంగీత ప్రియులను అలరించనున్నారు. రషీద్ ఖాన్ పాట పాడడం ప్రారంభిస్తే.. అక్కడ ప్రిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడుతుంది. అతని గాత్రానికి ప్రతి ఒక్కరూ మంత్రం ముగ్దులవుతారు. తన సంగీతంతో .. తన గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడిస్తారు ఉస్తాద్ రషీద్ ఖాన్.  ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ సంగీత ప్రస్థానం గురించి తెలుసుకుందాం..

క్రికెటర్ కావాలనుకున్న ఉస్తాద్ రషీద్ 
రషీద్ తన 11 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలో తన మొదటి సారి ప్రదర్శన ఇచ్చారు. అయినప్పటికీ సంగీతకారుడు కావాలని కోరుకోలేదు. నిజానికి రషీద్ ఖాన్ మంచి క్రికెటర్‌ని కావాలనుకున్నారు. అయితే.. కుటుంబంలో వారసత్వంగా వస్తున్న సంగీతానికి ఎంతో కాలం దూరంగా ఉండలేకపోయారు. అదే సమయంలో గజల్స్ తో పాటు మరికొన్ని సంగీత కార్యక్రమాలు చూసి సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఉస్తాద్ రషీద్ ఖాన్ రాంపూర్-సహస్వాన్ ఘరానాకు చెందిన సింగర్. ఉస్తాద్ ఇనాయత్ హుస్సేన్ ఖాన్ మునిమనవడు, గులాం ముస్తఫా ఖాన్ మేనల్లుడు. అయినప్పటికీ రషీద్ తన మామ నిసార్ హుస్సేన్ ఖాన్ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకున్నాడు. అలాగే ఉస్తాద్ గులాం ముస్తఫా ఖాన్ దగ్గర ట్రిక్స్ నేర్చుకున్నారు. ఉస్తాద్ రషీద్ ఖాన్ ఆరేళ్ల వయసులో సంగీత విద్యనభ్యసించడం ప్రారంభించారు.

ప్రత్యేకమైన శైలి కలిగిన ఉస్తాద్ రషీద్ ఖాన్ 
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో జూలై 1, 1968న జన్మించిన ఉస్తాద్ రషీద్ ఖాన్ హిందుస్తానీ సంగీతాన్ని… సింపుల్ సంగీత శైలితో కలిపి ప్రయోగాలు చేశారు. విదేశీ వాయిద్యకారులతో కలిసి అనేక ప్రయోగాత్మక కచేరీలు చేశారు. అంతేకాదు ఉస్తాద్ రషీద్ ఖాన్ తన గాత్ర మాయాజాలాన్ని బాలీవుడ్ చిత్రాలలో కూడా చూపించారు. హమ్ దిల్ దే చుకే సనమ్ నుండి ‘అల్బెలో సజన్ ఆయో రే’,  జబ్ వి మెట్ లో ‘ఆవోగే జబ్ తుమ్ హో సజ్నా’ వంటి సాంగ్స్ తో పాటల ప్రేమికులను అలరించారు.

ప్రస్తుతం కోల్‌కతాలో నివసిస్తున్నారు ఉస్తాద్ రషీద్ ఖాన్‌. పండిట్ భీంసేన్ జోషి .. ఉస్తాద్ రషీద్ ఖాన్‌.. సంగీత ప్రపంచంలో చాలా ప్రత్యేకం అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు హిందుస్తానీ క్లాసికల్ భవిష్యత్ కు భరోసా ఇతని గాత్రం అంటూ పేర్కొన్నారు. వాస్తవానికి రషీద్ ఖాన్ గానం రాంపూర్-సహస్వాన్ గయాకి గ్వాలియర్ ఘరానాకు చెందినది. టెంపో, గాత్రం, సంక్లిష్టమైన రిథమిక్ గాత్రాలను కలిగి ఉంటుంది. సర్గం, టంకారి వాడకంలో అసాధారణమైన నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేశారు. రషీద్ తన న గురువులాగా పాడటంలో నిపుణులు.. ఆయినప్పటికీ తనదైన శైలిలో పాడుతూ.. సంగీత ప్రపంచంలో తనదైన  శైలితో ఖ్యాతిగాంచారు.

సంగీతం ఏ రూపంలో వచ్చినా హిందుస్థానీ క్లాసికల్‌ను ఎప్పటికీ భర్తీ చేయలేమని చెప్పే రషీద్ ఖాన్ ను పద్మ భూషణ్ సహా అనేక అవార్డులు వరించాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..