MP Avinash Reddy: మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు అవినాష్‌రెడ్డి తల్లి.. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి నుంచి ఏఐజీ ఆస్పత్రికి..

చికిత్స నిమిత్తం కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. గచ్చబైలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కార్డియాలజీస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంతో ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందిన విషయం తెలిసిందే.

MP Avinash Reddy: మరింత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు అవినాష్‌రెడ్డి తల్లి.. కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి నుంచి ఏఐజీ ఆస్పత్రికి..
Avinash Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: May 26, 2023 | 5:25 PM

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మకు మరింత మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్‌ తీసుకొచ్చారు. చికిత్స నిమిత్తం కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. గచ్చబైలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కార్డియాలజీస్ట్ డాక్టర్ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో చికిత్స అందిస్తున్నారు. అనారోగ్యంతో ఈనెల 19 నుంచి కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆమె పరిస్థితి నిలకడగా ఉండటంతో మరింత మెరుగైన చికిత్సను ఇక్కడ అందిస్తున్నారు. అవినాష్‌ కేసులో వాదనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళనే మొత్తం వాదనలను పూర్తి చేస్తానని జడ్జి చెప్పడంతో న్యాయవాదులు పోటా పోటీగా తమ వాదనలను బలంగా వినిపిస్తున్నారు. రంగన్న స్టేట్‌మెంట్‌లో క్లియర్‌గా నలుగురు నిందితుల పేర్లు చెప్పినా ఆ వివరాలు ఎక్కడా లేవని అవినాష్‌ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక దస్తగిరిని ఒక్క సారి కూడా విచారణకు పిలువలేదని.. అరెస్ట్‌ చేయలేదని వాదించారు. దస్తగిరి అవినాస్‌ గురించి ఎక్కడా చెప్పలేదని తెలిపారు.

సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సంవత్సరం తరువాత జనవరి 23 న అవినాష్‌కు నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. అవినాష్‌పై లేని పోని అబాండాలు మోపుతున్నారని కోర్టుకు తెలిపారు. ఈ నెల 19న సీబీఐ ముందుకు రావాల్సి ఉండగా.. తల్లి ఆరోగ్యం సీరియస్‌గా ఉండడంతో మార్గమధ్యలో నుంచి వెనక్కు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అప్పటి నుంచి కర్నూలు ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. అందుకే 27 వరకు హాజరు కావడానికి సమయం అడిగామన్నారు. ఇక ఆధారాలు మాయం చేస్తారని వస్తున్న ఆరోపణలను కూడా ఖండించారు.

అటు.. అవినాష్‌రెడ్డి న్యాయవాది వాదనలు వినిపిస్తుండగానే.. సునీతా రెడ్డి లాయర్‌ జోక్యం చేసుకున్నారు. అసహనానికి గురైన జడ్జి మందలించారు. తాను కేసు పూర్తి వివరాలు పూర్తిగా తెలుసుకుంటున్నానని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.