AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఈ కడక్ నాథ్ కోడి భలే ఖతర్నాక్.. దాని వింత చేష్టలతో జనం పరేషాన్..

కడక్ నాథ్ కోడి.. ఖతర్నాక్ అనిపించుకుంటోంది. దాన్ని కోసి వండుకుని తిని జిహ్వ చాపల్యాన్ని తీర్చిందన్న ఉద్దేశ్యంతో ఈ మాట అనడం లేదు. దాని యజమాని ఎలా చెప్తే అలా వింటుండడమే దాని స్పెషాలిటీ. అయితే ఈ కడక్‎నాథ్ కోడి యజమానికి కూడా స్పెషాలిటీ ఉంది. కరోనా లాక్ డౌన్ వరకు ప్రైవేటు పాఠశాలను నడిపి విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన ఆర్థిక భారం పడడంతో వ్యవసాయం వైపు అడుగులేశారు. ఇందులో భాగంగా వివిధ జాతులకు సంబంధించిన పశు పక్ష్యాదులను కూడా పెంచుతున్నారు.

Watch Video: ఈ కడక్ నాథ్ కోడి భలే ఖతర్నాక్.. దాని వింత చేష్టలతో జనం పరేషాన్..
Kadaknath Chicken
G Sampath Kumar
| Edited By: |

Updated on: Jun 18, 2024 | 5:38 PM

Share

కడక్ నాథ్ కోడి.. ఖతర్నాక్ అనిపించుకుంటోంది. దాన్ని కోసి వండుకుని తిని జిహ్వ చాపల్యాన్ని తీర్చిందన్న ఉద్దేశ్యంతో ఈ మాట అనడం లేదు. దాని యజమాని ఎలా చెప్తే అలా వింటుండడమే దాని స్పెషాలిటీ. అయితే ఈ కడక్‎నాథ్ కోడి యజమానికి కూడా స్పెషాలిటీ ఉంది. కరోనా లాక్ డౌన్ వరకు ప్రైవేటు పాఠశాలను నడిపి విద్యార్థులను తీర్చిదిద్దిన ఆయన ఆర్థిక భారం పడడంతో వ్యవసాయం వైపు అడుగులేశారు. ఇందులో భాగంగా వివిధ జాతులకు సంబంధించిన పశు పక్ష్యాదులను కూడా పెంచుతున్నారు. గతంలో స్టూడెంట్స్‎కు విద్యా బుద్దులు నేర్పిన ఆయన ఇప్పుడు పశు పక్ష్యాదులను గాడిలో పెడుతున్నారు. గత నాలుగేళ్లుగా లక్ష్మీపూర్ లోని వ్యవసాయ భూమిలో వినూత్న ప్రయోగాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కరోనా సమయంలో వ్యవసాయ క్షేత్రం వద్ద కూరగాయల దుకాణం ఏర్పాటు చేసి ఆన్ లైన్ పేమెంట్‎కు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. వెజిటేబుల్స్ అమ్మేందుకు ప్రత్యేకంగా మనిషిని ఉంచకుండా మీకు తోచిన కూరగాయలు తీసుకెళ్లండి.. నచ్చినంత పే చేయండి అని రాసి పెట్టారు. మల్లారెడ్డి ఏర్పాటు చేసిన ఈ కూరగాయల దుకాణం గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయంలో సేంద్రీయ పద్దతులు పాటిస్తూ వివిధ రకాల పంటలు వేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో కడక్ నాథ్ కోళ్ల ఫారం కూడా ఏర్పాటు చేసి వాటిని పెంచి పోషిస్తున్నారు.

మాట వింటున్న కోడి..

సాధారణంగా కోళ్లను పిలవాలంటే ‘‘బ్బబ్బబ్బబ్బ’’ అంటూ వాటి యజమానులు పిలుస్తుంటారు. దీంతో అవి తమ యజమాని గొంతు నుండి వస్తున్న కూత విని చకాచకా ఇంటికి చేరుకుంటాయి. కోళ్లకు ఆహారం వేసేప్పుడో.. గంప కింద దాచి పెట్టేప్పుడో కోళ్లను పిలిచేందుకు ఈరకమైన శబ్దాన్ని చేస్తూ ఉంటారు. కానీ మల్లారెడ్డి ఫారంలో పెరుగుతున్న కడక్ నాథ్ కోళ్లలో ఈ కోడి మాత్రం కాస్త డిఫరెంట్‎గానే వ్యవహరిస్తోంది. ఆయన భుజాలపైకి ఎక్కడం.. కాళ్లపై సెద తీరడం వంటి చర్యలతో యజమానితో సాన్నిహిత్యంగా మెలగడం మొదలుపెట్టింది. మిగతా కడక్ నాథ్ కోళ్లకన్నా భిన్నంగా ఈ ఒక్క కోడి స్టైల్ వెరైటీగా ఉండడంతో మల్లారెడ్డి కూడా దీనితో అనుభందం పెంచుకున్నారు. ఈ క్రమంలో ఆ కోడికి తాను చెప్పిన మాటలు అర్థం అయ్యేలా శిక్షణ ఇచ్చారు. దీంతో ఆ కోడి ముందుకు రా అనగానే ముందుకు రావడం.. వెనక్కు రా అని చెప్పగానే వెనక్కి వస్తుండడంతో చూపరులను అబ్బురపరుస్తోంది. మల్లారెడ్డి ఎలా చెప్తే అలా ముందుకు వెనక్కు నడుస్తున్న ఈ కోడి గురించి ఆ నోట ఈ నోట ప్రచారం సాగింది. యజమాని మాట వింటున్న కోడిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఏది ఏమైనా ఒకప్పుడు తన పాఠశాలలో విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పిన మల్లారెడ్డి ఇప్పుడు కోళ్లను కూడా క్రమశిక్షణలో పెడుతున్నారంటూ స్థానికులు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..