Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..

|

Dec 27, 2021 | 3:44 PM

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను చూపాలని ధర్నాకు దిగారు. 61వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం 317 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

Teachers Protest: జూనియర్లకు పట్టం కడతారా.. ఆ జీవోను రద్దు చేయాల్సిందే.. రోడ్డెక్కిన ఉపాధ్యాయులు..
Teachers Protest
Follow us on

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఉపాధ్యాయులు రోడ్డెక్కారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను చూపాలని ధర్నాకు దిగారు. 61వ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వం 317 జీవోను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. జీవోను రద్దు చేసేవరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల బైఠాయింపుతో జాతీయరహదారి 44పై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. రహదారిపై కిలోమీటరు మేరకు వాహనాలు నిలిచిపోయాయి.

ఉమ్మడి ఆదిలాబాద్ లో ఉద్యోగులు రోడ్డెక్కారు. బదిలీలపై భగ్గుమంటూ ఆందోళనలకు దిగారు. సీనియార్టీని పరిగణలోకి తీసుకోకుండా జూనియర్లకు పట్టం కట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. గిరిజన ఆదివాసీ సంఘం ఇచ్చిన పిలుపుతో రోడ్ల దిగ్బందం చేపట్టిన గిరిజన ఉద్యోగులు 317 జీవో రద్దే లక్ష్యంగా ఆదిలాబాద్‌లో ఆందోళనలు నిర్వహించారు.

అన్ని శాఖలతో పోలిస్తే విద్యాశాఖలో ఉపాద్యాయులుగా సర్వం కోల్పోయామని.. బదిలీల్లో భారీ అవకవతకలు జరిగాయని.. కౌన్సిలింగ్ రద్దు చేసి మళ్లీ పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేశారు సీనియర్ ఉపాద్యాయ ఉద్యోగులు. 25 ఏళ్ల కు పైగా సీనియార్టీ ఉన్నా సొంత జిల్లాలో అవకాశం దక్కలేదని.. ఆప్షన్స్‌లో చివరి స్థానంగా ఎంచుకున్న జిల్లాకు బదిలీ చేశారంటూ ఆగ్రహాం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రాలలో ఆందోళనకు దిగారు. తమ న్యాయం జరగకపోతే ఈ ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామంటూ హెచ్చరించారు.

ఐటిడిఏ ముట్టడి..
గిరిజ‌న ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన తమను ఎలాంటి ఉపయోగం లేని గిరిజనేతర ప్రాంతాలకు బదిలీ చేశారని ఆరోపిస్తూ ఉట్నూర్ ఐటిడిఏ ను ముట్టడించారు ఉద్యోగులు. షెడ్యూల్ 5 నిబందనలను తుంగలోకి తొక్కుతూ ఇష్టారీతిన బదిలీలు చేపట్టారని.. ఇదేంటని అడిగితే నోడల్ అదికారి , కలెక్టర్ సరైన సమాదానాలు ఇవ్వడం లేదని.. ఏదైనా ఉంటే ముందు ఉద్యోగాల్లో జాయిన్ అయిన తరువాత చూద్దమంటూ నిర్లక్ష్యంగా సమాదానం ఇస్తున్నారంటూ గిరిజన ఉపాద్యాయులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న 317 జీవో రద్దు చేయాలని.. జీవో నంబర్ 3 ను యదావిదిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయంలోని కౌన్సిలింగ్ హాలు వద్ద ఆందోళనలకు దిగారు‌ గిరిజన ఉద్యోగులు.

నిర్మల్ లో రాస్తా బంద్
ఇటు నిర్మల్ జిల్లాలో జాతీయ రహదారి 44పై ఉపాద్యాయ సంఘాల నాయకులు , బదిలీ బాదిత ఉపాద్యాయులు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారిని గంటపాటు దిగ్బందించారు. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి వెంటనే బదిలీల్లో తప్పులను సవరించి ప్రభుత్వం న్యాయం చేయాలని నిర్ణయించారు డిమాండ్ చేసారు. బదిలీల్లో భార్య భర్తల విషయంలోని కటువుగా వ్యవహరించారని.. బదిలీల్లో కొందరి జోన్లే మారిపోయాయని.. భార్య బాసర జోన్ లో నిర్మల్ కు బదిలీ అయితే భర్త కాళోశ్వరం జోన్ లోని ఆసిపాబాద్ కు బదిలీ అయ్యారని.. ఇదేం అన్యాయమని నిలదీశారు. సీనియార్టీ లిస్ట్ లో టాప్ లో ఉన్న ఉద్యోగులను వదిలేసి.. జూనియర్లకు పట్టం కట్టారని.. బదిలీల్లో భారీ స్థాయిలో అవకవతలు జరిగాయని ఆరోపించారు ఉద్యోగులు.

నోడల్ అదికారులే అవకతవకలకు పాల్పడ్డారని ప్రభుత్వం వెంటనే స్పందించి సీనియర్లకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆందోళనలను మరింత ఉదృత చేస్తామని హెచ్చరించారు. ఆదివాసీల హక్కుల సంఘం తుడుందెబ్బ సైతం బదిలీ వ్యవహారంలో ప్రభుత్వం పునారాలోచించాలని.. లేదంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరించింది. ఆదివాసీ , ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపుతో ఆదివాసీ ప్రాంతాల్లో బంద్ ప్రశాంతంగా కొనసాగగా.. జిల్లా కేంద్రాలలో బంద్ పాక్షికంగా కొనసాగింది.

                                                                నరేష్ స్వేన, టీవి9 తెలుగు, ఉమ్మడి ఆదిలాబాద్

ఇవి కూడా చదవండి: Ministry Report: కోవిడ్-19 తాజా పరిస్థితిపై ఈసీ సమీక్ష.. ఆ 5 రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగవంతంగా సాగుతోందన్న కేంద్రం

Viral video: మ్యూజిక్‌ షూట్‌లో చేదు అనుభవం.. సింగర్‌ ముఖంపై కాటేసిన పాము.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..