Telangana: అయ్యో దేవుడా.. దారి తప్పి వచ్చిన దుప్పి.. పాపం ఏం జరిగిందో తెలుసా..

అడవి నుండి దారితప్పి గ్రామ శివారులోకి వచ్చిన మచ్చలదుప్పి వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు బలైయింది. ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన దుప్పిని రైతులు గమనించి అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ సిబ్బంది గుర్తించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. వేటగాళ్ళ కోసం ఆరాతీస్తున్నారు.

Telangana: అయ్యో దేవుడా.. దారి తప్పి వచ్చిన దుప్పి.. పాపం ఏం జరిగిందో తెలుసా..
Jangaon Wildlife

Edited By:

Updated on: Oct 14, 2025 | 10:01 AM

అడవి నుండి దారితప్పి గ్రామ శివారులోకి వచ్చిన మచ్చలదుప్పి వేటగాళ్లు అమర్చిన ఉచ్చులకు బలైయింది. ఉచ్చులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయింది. దుప్పిని గమనించిన రైతులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దుప్పి మృతదేహాన్ని స్వాధీనం చేసుకన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం విశ్వనాధపురం గ్రామ సమీపంలో జరిగింది. గ్రామ శివారు నమిలికొండ గుట్టల నుండి ఓ దుప్పిమచ్చల దుప్పి దారితప్పి పంట పొలాల్లోకి వచ్చింది. అక్కడ దుక్కిటేద్దులు, పశువులతో కలిసి చెంగుచెంగున ఎగురుతూ తిరిగింది..ఆ దుప్పిని చూసి రైతులు ఆనందంతో మురిసిపోయారు.

అయితే స్వేచ్ఛగా పంట పొలాల వద్ద సంచరించిన ఆ దుప్పి కొద్దిసేపటికే మృత్యువాత పడింది. గ్రామ శివారులో వేటగాళ్లు అమర్చిన ఉచ్చులలో పడి ఆ వైర్లు మెడకు చుట్టుకొని ప్రాణాలు కోల్పోయింది. దాన్ని చూసిన గ్రామస్తులు చలించిపోయారు. వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మృత్యువాత పడ్డ దుప్పిని పరిశీలించి పోస్టుమార్టం చేయించి కళేబరాన్ని పూడ్చిపెట్టారు.

ఈ ప్రాంతంలో వన్యప్రాణుల వద కోసం అడవి పందులు, దుప్పులను హతమార్చడం కోసం ఉచ్చులు, విద్యుత్ వైర్లు అమర్చుతున్న వారి కోసం పోలీసులు అటవీశాఖ సిబ్బంది ఆరా తీస్తున్నారు. ఈ దుప్పి మరణానికి కారకులైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.