AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: చుక్క పడ్డాకే అసలు సీన్ మొదలైంది.. కాళికా బార్‌లో సినిమా ఫైటింగ్ రియల్ సీన్.. వీడియో

వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మధ్య మత్తులో రెచ్చిపోయారు. ఓ బార్‌లో మద్యం సేవిస్తున్న క్రమంలో మాట మాట పెరిగి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో వీరంగం సృష్టించిన ఆ మందుబాబులు ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించారు.

Watch: చుక్క పడ్డాకే అసలు సీన్ మొదలైంది.. కాళికా బార్‌లో సినిమా ఫైటింగ్ రియల్ సీన్.. వీడియో
Warangal Bar Fight
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Oct 14, 2025 | 9:13 AM

Share

వరంగల్ కాశీబుగ్గ ప్రాంతంలో కొందరు వ్యక్తులు మధ్య మత్తులో రెచ్చిపోయారు. ఓ బార్‌లో మద్యం సేవిస్తున్న క్రమంలో మాట మాట పెరిగి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పిడిగుద్దులతో వీరంగం సృష్టించిన ఆ మందుబాబులు ప్రశ్నించిన వారిపై ప్రతాపం చూపారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించారు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా ఈ ఫైటింగ్ సీన్ పై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. అచ్చం సినిమా ఫైటింగ్‌ను తలపించేలా జరిగిన ఈ దాడి ఘటన వరంగల్ కాశిబుగ్గ ప్రాంతంలోని “కాళిక బార్” లో జరిగింది.. మద్యంమత్తులో వీరంగం సృష్టించారు ఒక వర్గానికి చెందిన వ్యక్తులు.. ఇద్దరు యువకులపై విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. బార్ లోపల లాన్‌లో మద్యం తాగుతున్న క్రమంలో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఒకవైపు నిలబడి మద్యం తాగుతున్నారు.. వారిలో ఒకవ్యక్తి వచ్చి పక్కన మద్యం తాగుతున్న వ్యక్తులతో గొడవ పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మాట మాట పెరిగింది.. వారి పక్కనే ఉన్న మరో యువకుడు వచ్చి వారిని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతనిపై దాడికి పాల్పడ్డాడు.. మధ్య మధ్యలో ఆ నలుగురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేశారు.

అయితే.. ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించిన బార్ షాపు నిర్వాహకులతో సహా స్థానికులపై కూడా విచక్షణ రహితంగా దాడి చేశారు మందుబాబులు.. ఇనుప రాడ్డుతో కొట్టి గాయపరిచారు.. ఈ దాడి దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి.. ఈ దుండగుల దాడిలో ప్రాణాలతో బయటపడ్డ బాధితులు ఏనుమాముల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో చూడండి..

ఏనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి పోకిరీలు నిత్యం మారణాయుధాలతో బీభత్సం సృష్టిస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. వారి నుంచి ప్రాణ హాని ఉందని తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే విచక్షణరహితంగా దాడులు చేస్తున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు..

Follow Us
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2..
తల్లిదండ్రుల కోసం చాణక్య నీతి: పిల్లలకు సంపద కంటే ముఖ్యమైన 2..
మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్‌ స్టార్స్‌... రూటెందుకు మారుస్తున్న
మాస్ మంత్రం పఠిస్తున్న క్లాస్‌ స్టార్స్‌... రూటెందుకు మారుస్తున్న
కుండీలు కొనాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు..
కుండీలు కొనాల్సిన పనిలేదు.. మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు..
దేశ ద్రోహానికి పాల్పడ్డడంటూ జో కెంట్‌పై విచారణ..!
దేశ ద్రోహానికి పాల్పడ్డడంటూ జో కెంట్‌పై విచారణ..!
వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్‌ మీద విమర్శలు
వివాదంలో కేడీ ది డెవిల్ మూవీ.. లేటెస్ట్ సాంగ్‌ మీద విమర్శలు
మీ ఇంట్లో 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉందా? ఈ నియమాలు తెలుసా?
మీ ఇంట్లో 100 గ్రాముల కంటే ఎక్కువ బంగారం ఉందా? ఈ నియమాలు తెలుసా?
ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?
ఎల్లమ్మ నుంచి ఆ హీరోయిన్ కూడా అవుట్.?
సమ్మర్‌ సినిమాలే కీలకం..అందాల భామల ఆశలన్నీ వాటి మీదే!
సమ్మర్‌ సినిమాలే కీలకం..అందాల భామల ఆశలన్నీ వాటి మీదే!
జూన్‌ 1 నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వేసవిసెలవులు ఎప్పట్నుంచంటే
జూన్‌ 1 నుంచే ఇంటర్ తరగతులు ప్రారంభం.. వేసవిసెలవులు ఎప్పట్నుంచంటే
చైత్ర నవరాత్రి 2026: 3 శుభ యోగాలు.. ఈ రాశులపై అదృష్టం జాక్‌పాట్!
చైత్ర నవరాత్రి 2026: 3 శుభ యోగాలు.. ఈ రాశులపై అదృష్టం జాక్‌పాట్!