-రైతులతో కలిసి వ్యవసాయ పనులు చేసిన పోలీసు అధికారి
-పొలంలో ఎరువులు చల్లుతూ, రైతులకు భరోసా కల్పించిన సీఐ
-పోలీస్ అధికారి చేసిన పనితో రైతుల హర్షం
దేశానికి కాపలా కాస్తూ సేవ చేయడం, దేశానికి అన్నం పెట్టడం.. ఈ రెండు వృత్తులను గొప్పవిగా భావిస్తారు. అందుకే జై జవాన్, జై కిసాన్ అనే నినాదం అంత ప్రాచుర్యం పొందింది. పోలీసులకు కూడా సైనికుల మాదిరే విధుల నిర్వర్తిస్తారు. సైనికులు దేశం భద్రతను కాపాడుతుంటే.. పోలీసులు దేశంలోని ప్రజల భద్రతను కాపాడతారు. సాధారణంగా విధుల్లో నిత్యం బిజీగా ఉండే పోలీసులును మనం చూస్తూనే వుంటాం. వాస్తవంగా చెప్పాలంటే వారికి కుటుంబ సభ్యులతో గడిపే సమయం కూడా దొరకదు. కాగా తాజాగా ఓ పోలీసు అధికారికి.. బందోబస్తుకు వెళ్తుండగా పంటపొలాల్లో రైతులను, రైతు కూలీలను చూడగానే తన నేపథ్యం గుర్తుకువచ్చింది. దీంతో తాను కూడా పొలంలోకి దిగి రైతుగా మారి.. అక్కడ ఉన్న అన్నదాతలను ఆశ్చర్యపోయేలా చేశాడు..సుమారు గంటపాటు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతకీ ఆ పోలీసు అధికారి ఎవరు..? ఈ ఘటన జరిగింది ఎక్కడో తెలుసుకుందాం పదండి.
జనగాం రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ కుమార్ లింగాల ఘన్ పూర్ పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. మండలంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తిరుగు ప్రయాణంలో.. కుందారం గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో మహిళా కూలీలు పత్తి మొక్కలకు యూరియా మందు వేస్తూ కనిపించారు. దీంతో వెంటనే జీపు ఆపి.. వారితో కలిసి పొలం పనులు చేసిన సీఐ వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయంలో ఏ కష్టమొచ్చినా తనకు ఫోన్ చేయాలని కోరారు. నిర్భయంగా తనకు ఫోన్ చేసి అడగవచ్చని అక్కడి రైతులకు తన పర్సనల్ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఓ పోలీస్ అధికారి తమతో కలసి పోలం పనులు చేయడంతో సదరు రైతులు ఆనంద పడ్డారు.
Also Read: కోవిడ్‌పై ఫైట్.. ఏపీ ప్రభుత్వానికి బాసటగా కియా ఇండియా.. గతంలో రూ.5 కోట్ల సాయం.. తాజాగా