Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జనగాం కలెక్టర్‌ నిఖిల

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమయ్యే పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జనగాం జిల్లా కలెక్టర్..

ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలల పునఃప్రారంభం.. ఏర్పాట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన జనగాం కలెక్టర్‌ నిఖిల
Follow us
K Sammaiah

|

Updated on: Jan 31, 2021 | 12:19 AM

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమయ్యే పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జనగాం జిల్లా కలెక్టర్ కె. నిఖిల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ కె నిఖిల ఆకస్మిక తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పాలకుర్తి మండలంలోని తొర్రూరు గ్రామ ప్రభుత్వ పాఠశాల, పాలకుర్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సాంఘీక సంక్షేమ ఆశ్రమ పాఠశాల, కళాశాలలను పరిశీలించారు.

పాఠశాలల్లోని అన్ని గదులు, కిచెన్, డార్మెటరిలను సానిటైజింగ్ చేయాలని అధికారులను కలెక్టర్‌ నిఖిల ఆదేశించారు. పాఠశాలల పరిసరాలను గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బందిచే శుభ్రం చేయించాలని సూచించారు. 9వ తరగతి నుండి ఆపై తరగతుల విద్యార్థులకు మాత్రమే పాఠశాలలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను బట్టి తరగతుల షెడ్యూల్ రూపొందించాలని, సీటింగ్ ఏర్పాట్లలో అన్ని జాగ్రత్తలు పాటించాలని పాఠశాల అధికారులకు సూచించారు. డెటాల్, లిక్విడ్ సోప్, సానిటైజర్లు అవసరం మేరకు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కోవిడ్-19 నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై పిల్లలకు అవగాహన కల్పించాలని, తరచుగా చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని కోరారు.

Job Fair: నిరుద్యోగులకు శుభవార్త.. హైదరాబాద్‌లో టీసేవా జాబ్‌ ఫెయిర్‌.. ఇంటర్‌ నుంచి…

బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
బాత్రూంలోకి వచ్చిన పాము.. నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బ్రో..
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నీటి అడుగున రైలు మార్గం..ముంబై టూ దుబాయ్‌..కేవలం రెండు గంటల్లోనే!
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
నార్త్ సినిమాల్లో సౌత్ మిక్చర్‌... సక్సెస్‌ కోసం బాలీవుడ్ పాట్లు
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
అందాలతో సెగలు రేపుతున్న పాయల్.. ఫొటోస్ చూస్తే మతిపోవాల్సిందే!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు బంద్.. ఏయే రోజుల్లో అంటే..!
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని భర్త ఏం చేశాడో తెలుసా?
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
రాత్రైదంటే వింత శబ్దాలు.. ఊరంతా భయం తో రచ్చ రచ్చ..
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం
ర్డీ సాయిబాబా సంస్థాన్ సంచలన నిర్ణయం.. భక్తులకు ఉచిత బీమా సౌకర్యం
బొప్పాయితో అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం..
బొప్పాయితో అందమైన, పట్టులాంటి మెరిసే చర్మం మీ సొంతం..
నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది..
నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది..