Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న వాలంటీర్ల వివాదం.. వాళ్ల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందన్న పవన్ కల్యాణ్

తాజాగా ఏపీలో గ్రామవాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు పవన్‌పై విరుచుకుపడుతున్నారు. గ్రామ వాలంటీర్లు సైతం ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తు్న్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా పవన్‌కు నోటీసులిచ్చింది.

Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న వాలంటీర్ల వివాదం.. వాళ్ల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందన్న పవన్ కల్యాణ్
Pawan Kalyan

Updated on: Jul 11, 2023 | 5:14 PM

తాజాగా ఏపీలో గ్రామవాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైసీపీ నేతలు పవన్‌పై విరుచుకుపడుతున్నారు. గ్రామ వాలంటీర్లు సైతం ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తు్న్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మహిళా కమిషన్‌ కూడా పవన్‌కు నోటీసులిచ్చింది. రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోతున్నారన్న వాఖ్యలపై వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. తాను మాట్లాడిన విషయంపై వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో తాజాగా పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయాలపై తనకు స్పష్టమైన అవగాహని ఉందని అన్నారు. ఉపాధి హామి కూలీ చేసుకునేవారికంటే గ్రామ వాలంటీర్ల వేతనాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థ లేనప్పుడు దేశం ఆగిపోయిందా.. ప్రజల వ్యక్తిగత సమాచారం అంతా వాలంటీర్ల దగ్గర ఉందని ఆరోపించారు.

ఈ గ్రామ వాలంటీర్లు వ్యక్తిగత సమాచారాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు. అమ్మాయిలు అదృశ్యం కావడంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. ఇందుకు సంబంధించిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకే నాపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు సేవ చేవ చేసేందుకు వచ్చిన వాలంటీర్లు వాళ్లపై దాడులు చేస్తారా అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు మాట్లాడిన మాటలకు నా భార్య కూడా ఏడుస్తోందని పేర్కొన్నారు. ఏలూరు నియోజకవర్గ నేతలు, వీరమహిళలతో భేటీ అయిన పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎవరో పెట్టిన పార్టీని వైసీపీ వాళ్లు లాగేసుకున్నారని.. యువతకు, రైతులకు ఏమి చేయని వైసీపీ నేతలు తనను బెదిరించారన్నారు. సీఎం జగన్ అంటే తనకు కోపం కాదని.. ప్రభుత్వ విధానాలపైనే ద్వేషమని.. నాయకులు తప్పులు చేస్తే అవి ప్రజలపై ప్రభావం చూపిస్తాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..