Pawan Kalyan: తెలంగాణాలో జనసేన పార్టీ బలోపేతం దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణ పోరాట స్ఫూర్తి తనకు దైర్యం నింపిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. రాజకీయాల్లోకి రావడం రిస్క్ అని అంటున్నారు.. ఎందుకు రిస్క్ అని ప్రశ్నించారు. సామజిక మార్పుకోసం పోరాడతాం..ఎన్నికల్లో ఓడిపోయినా వెనకడుగు వేసేది లేదని చెప్పారు పవన్. దెబ్బలు కొట్టే కొద్దీ మరింత ఎదుగుతామన్నారు. అడుగు పడితే తప్ప అనుభవం రాదని అన్నారు. తనకు పుస్తకాల్లో చదివిన దానికంటే.. ప్రత్యక్షంగా తిరిగినందువలన సమాజానికి కావాల్సిన అవసరాలు తెలిశాయని చెప్పారు. నేను కులం గురించి మాట్లాడుతుంటే.. కులాల రొచ్చులో ఎందుకు దిగుతున్నారు అని అంటున్నారు. కులం , రంగు, మతం మన ఛాయిస్ కాదు.. కులం అనేది సామాజిక సత్యం.. అది అర్ధం చేసుకుని.. సామజిక రుగ్మతను తొలగించే దిశగా అడుగువేయాలి. జనసేన పార్టీలో అన్ని కులాలకు ప్రాధ్యాత ఉంటుందని.. అన్ని కులాలు, అన్ని మతాల వారున్నారు. మన హక్కులు ఎదుటివారి హక్కులు భంగం కలిగించనంత వరకే అని చెప్పారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.
హిందువుల దేవాలయమీద దాడి జరిగితే ఖండిస్తే.. దానివలన ఓట్లు పోతాయని తాను అనుకోలేదని అన్నారు. భాషలను గౌరవించే సంప్రదాయం.. తమ పార్టీ ఖచ్చితంగా పాటిస్తోందని ..మన భాషని యాసని తాను గౌరవిస్తున్నట్లు చెప్పారు. సంస్కృతిని కాపాడే విధంగా తాము నడుచుకుంటామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు ప్రాంతీయ వాదాన్ని అగౌరవ పరిస్తే.. మేము ఈ దేశానికి చెందిన వారిమేనా అని చాలా మంది బాధపడ్డారు. అందుకని ప్రాంతీయ వాదాన్ని గౌరవిస్తూ.. దేశాన్ని ప్రేమించాలని సూచించారు. వ్యక్తులను తాను వర్గశత్రులుగా భావించానని.. సమాజంలో ఉన్న సమస్యలే వర్గ శత్రువులని చెప్పారు. సమస్యలను అందరం కలిసి తీర్చే విధంగా పోరాడాలని తెలిపారు.
తెలంగాణ లో ఉన్న గొప్పదనం ఏమిటంటే.. పదిహేడేళ్ల కుర్రాడు లో సమస్యపై పోరాడతారు. ఖమ్మం జిల్లాలోని నల్లమల్ల సమస్య కోసం తనవద్దకు వచ్చిన తీరు ఎప్పటికీ మరచిపోనని తెలిపారు. అంత గొప్ప పోరాట స్ఫూర్తి తెలంగాణ సొంతమని అన్నారు.
Also Read: పంటలు తింటున్నాయని 30 లక్షల పిచ్చుకలను చంపేసిన చైనా.. ఆ పాపం ఎలాంటి పరిస్థితిని కల్పించిందంటే