Janasena in Telangana : సేనాని చూపు తెలంగాణ వైపు .. పార్టీ విస్తరణపై పవన్ సంచలన కామెంట్స్

జనసేన పార్టీ తెలంగాణాలో విస్తరించే దిశగా ముందు అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణాలో పార్టీని విస్తరించనున్నామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్...

Janasena in Telangana : సేనాని చూపు తెలంగాణ వైపు .. పార్టీ విస్తరణపై పవన్ సంచలన కామెంట్స్

Edited By:

Updated on: Feb 28, 2021 | 4:29 PM

Janasena in Telangana : జనసేన పార్టీ తెలంగాణాలో విస్తరించే దిశగా ముందు అడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణాలో పార్టీని విస్తరించనున్నామని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్  జనసేన వీరమహిళా సమావేశంలో చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది. జనసేన పురుడు పోసుకుంది తెలంగాణలోనే.. ఆంధ్రప్రదేశ్ జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు.

అంతేకాదు తొలి ఎంపీటీసీ ని జనసేన గెలుచుకుంది తెలంగాణలోనే అని గుర్తు చేసుకున్నారు. ఇక 2014 లో ఒక్క మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసింది అనంతరం తెలంగాణ కంటే ఆంధ్రావైపే ఎక్కువుగా పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టారు. తెలంగాణలో వ్యక్తి గతంగా అభిమానులున్నారు.. వారి ఆలోచనలు అనుగుణంగా అడుగులు వేస్తున్నట్లు పవన్ చెప్పారు.

ఇక మరోవైపు అధికార పార్టీ నేతలు జనసేన పై తీవ్ర విమర్శలు చేశారు.. ఎక్కడ సంపద ఉంటుందో అక్కడ దోచుకోవడానికి పార్టీలు వస్తున్నాయని గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Also Read: