యూపీ, హర్యానా ప్రాచీన మల్లయుద్ధ యోధులతో పవన్‌ కుస్తీ, ప్రతీ ఒక్కరూ బరిలో దిగండన్న జనసేనాని

ప్రాచీన మల్లయుద్ధాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేందుకు యువత ప్రయత్నించాలని ఆయన సూచించారు. తాను హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్‌లో..

యూపీ, హర్యానా ప్రాచీన మల్లయుద్ధ యోధులతో  పవన్‌  కుస్తీ, ప్రతీ ఒక్కరూ బరిలో దిగండన్న జనసేనాని
Follow us
Venkata Narayana

|

Updated on: Feb 28, 2021 | 4:28 PM

ప్రాచీన మల్లయుద్ధాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఆత్మరక్షణతో పాటు ఆత్మస్థైర్యాన్ని పెంచుకునేందుకు యువత ప్రయత్నించాలని ఆయన సూచించారు. తాను హీరోగా నటిస్తోన్న సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు యూపీ, హర్యానాల నుంచి వచ్చిన మల్లయోధులతో పవన్ కళ్యాణ్ కాసేపు సందడి చేశారు. వారితో పిచ్చాపాటీ మాట్లాడారు. ఈ సందర్భంగా వారంతా పవన్‌కల్యాణ్‌తో ఫొటోలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీ.. జై.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వెలిబుచ్చారు.

ఇదిలాఉంటే, పశ్చిమగోదావరిజిల్లా భీమవరం సెంట్రిక్ గా జనసేనాని Vs గ్రంధి శ్రీనివాస్‌ వార్ కొనసాగుతోంది. ఇద్దరి మధ్య బుల్లెట్ల లాంటి డైలాగ్‌లు పేలుతున్నాయి. పవన్‌ను గ్రంథి విమర్శిస్తే… వైసీపీ ఎమ్మెల్యే ఓ ఆకు రౌడీ అంటూ కౌంటర్‌ ఇచ్చారు జనసేనాని. కట్ చేస్తే, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ స్టేట్ రౌడీ. జనసైనికులు ఆకురౌడీలు. ఇది మీ పేటెంట్ హక్కు అంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పార్టీ పెట్టి అవగాహన లోపం, అజ్ఙానంతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్‌ను చూస్తే ఆశ్చర్యం వేస్తోందంటూ విమర్శించారు. మీకు మానసిక జాఢ్యం ఉంది, నీవొక మానసిక రోగి, సూసైడ్‌కు యత్నించావన్నారు. తనను పిచ్చి కుక్కల వ్వాన్‌లో వేసి పంపుతానన్నావు.. రెండు చోట్ల అదే వ్యాన్లో మిమ్మల్ని వేసి పంపించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు తలలు నరికితే నరికించుకోవడానికి ఎల్లప్పుడూ మా తలలు వంచి మీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉంటామన్నారు.

అంతకు ముందు గ్రంధిని తీవ్ర స్థాయిలో విమర్శించారు పవన్. పీటం కదులుతంటే.. వణుకు పుడుతుందంటూ కామెంట్ చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ బ్యాంకులను దోచారన్న పవన్.. మీ పరిధిలో ఉండండి.. దాడులు చేస్తే ఊరుకోం.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు. భాషను హద్దులో పెట్టుకోవాలంటూ సూచించారు. కుక్కలు.. అరిచినా.. స్పందించవద్దంటూ జనసేన పార్టీ కార్యకర్తలకు పవన్ సూచించారు. మున్సిపాల్టీ వ్యాన్ వచ్చి తీసుకెళ్లే వరుకు వెయిట్ చేయాలన్నారు. మొన్న అన్న రాంబాబు.. ఇప్పుడు గ్రంధి శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్యేలు, పవన్ మధ్య ఇలా మాటల యుద్ధం నడుస్తోంది.

Read also : డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలకిక చరమగీతం.. లైసెన్స్ పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌, అడ్రస్ చేంజ్ వంటివన్నీ ఇక మేడ్ ఈజీ