తమ ప్రాంతంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌కు చేసాడు ఓ యువకుడు. సోమవారం జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరైన బీరం రాజేష్ జగిత్యాల పట్టణంలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదంటూ అదనపు కలెక్టర్ బి.ఎస్. లతకు వినతిపత్రం అందజేశాడు. వైన్ షాప్ ఓనర్లంతా సిండికేట్‌గా మారి కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలను నిలిపివేసారని… కల్తీ మద్యం అమ్ముతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నరేష్ ఆరోపణలు చేశాడు. అనుమతి పొందే సమయంలో అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంచుతామని చెప్పి, ఇప్పుడు నాణ్యత లేని బీర్లు అమ్ముతూ మోసం చేస్తున్నారని పేర్కొన్నాడు. వీటి ద్వారా ప్రజలకు ఆరోగ్య సమస్యలు రావడమే కాకుండా, ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని చెప్పుకొచ్చాడు. ఒరిజినల్ బీర్లు కోసం 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం వెళ్లి… వచ్చే క్రమంలో ప్రమాదానికి గురవుతున్నారని తన లేఖలో రాజేష్ పేర్కొన్నాడు. వెంటనే కింగ్ ఫిషర్ బీర్లను జగిత్యాల ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అధికారులను కోరాడు నరేష్.
ప్రజావాణి కార్యక్రమంలో బీరుకు సంబంధించి ఫిర్యాదు రావడంతో అధికారులతో పాటు పట్టణవాసులు తొలుత ఆశ్చర్యానికి గురయ్యారు. కాగా, ఈ ఫిర్యాదును స్వీకరించిన అధికారులు దాన్ని అబ్కారీ శాఖకు బదిలీ చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి