Rahul Gandhi: రాహూల్ గాంధీకి కేరళ ఎమ్మెల్యే లేఖ.. తెలంగాణ ఎన్నికలపై ఏమన్నారంటే..

|

Nov 06, 2023 | 12:29 PM

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహూల్ గాంధీ తెలంగాణలో తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అన్ని వర్గాలను ఆకర్షించేలా పథకాలను రూపొందించారు. ఈ మధ్యకాలంలో వరుసగా బహిరంగసభలకు హాజరవుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక లేఖ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జాతీయ కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇవ్వాలని ఇండియన్

Rahul Gandhi: రాహూల్ గాంధీకి కేరళ ఎమ్మెల్యే లేఖ.. తెలంగాణ ఎన్నికలపై ఏమన్నారంటే..
Iuml National General Secretary, Mla Pk Kunhalikutty Writes A Letter To Rahul Gandhi Supporting Congress Party In Telangana Elections
Follow us on

కాంగ్రెస్ పార్టీ అధినేత రాహూల్ గాంధీ తెలంగాణలో తన పార్టీని అధికారంలోకి తీసుకురావాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా అన్ని వర్గాలను ఆకర్షించేలా పథకాలను రూపొందించారు. ఈ మధ్యకాలంలో వరుసగా బహిరంగసభలకు హాజరవుతూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక లేఖ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జాతీయ కాంగ్రెస్‌కు బేషరతుగా మద్దతు ఇవ్వాలని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిర్ణయం తీసుకున్నట్లు ఈ లేఖ సారాంశం. దీనిని కేరళ ఎమ్మెల్యే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, పికె కున్హాలికుట్టి రాశారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు తెలంగాణలో బలమైన మూలాలు ఉన్నాయని ఈ లేఖలో ప్రస్తావించారు.

భారత్ ఫ్రంట్‌లో భాగంగా తెలంగాణలో ప్రస్తుత పాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి పోరాడేందుకు సిద్దమని తెలిపింది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తన మద్దతును ప్రకటించారు. 2024 లోక్‌సభ ఎన్నికలలో భారతదేశంలో కాంగ్రెస్ విజయం సాధించేందుకు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం తమ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటారని తెలిపారు. దీంతో ముస్లీంలు 17% వరకూ ఉన్న తెలంగాణలో ఈ పార్టీ ప్రభావం ఏమేర చూపుతుందో అన్న సందేహం కలుగుతుంది. ఒకవేళ ముస్లీం సామాజిక వర్గం ఓట్లు కాంగ్రెస్ వైపుకు తిరిగితే అధికారం సాధించగలదన్న ఆశ కాంగ్రెస్ నేతల్లో మొదలైంది. ఇప్పటికే అన్ని సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మ్యానిఫెస్టో రూపొందిస్తోంది. ఇక ముస్లీం సామాజిక వర్గానికి కూడా అనుకూలంగా ఉండేలా ఏవైనా పథకాలను ప్రకటిస్తే అప్పుడు పరిస్థితి కొంత మారే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. ఏది ఏమైనా ఈ లేఖ ప్రభావం తెలంగాణ కాంగ్రెస్ మీద పడుతుందా లేదా అన్నది ఒక నెల రోజుల్లో తేలిపోతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..