హైదరాబాద్, జులై 27: కేవలం పాఠాలు చెప్పడం, రాత పరీక్షలు జరిపి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడం మాత్రమేకాకుండా హాజరుకూ మార్కులు కేటాయించాలని రాష్ట్ర విద్యాశాఖకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) చేసిన సిఫార్సు చేసింది. విద్యార్ధులను 360 డిగ్రీల్లో పరీక్షించేలా కార్యచరణ రూపొందించాలని తన సిఫార్యుల్లో పేర్కొంది. నైపుణ్యాలు అలవడేందుకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, చర్చలు, క్విజ్‌లు లాంటి వాటికి పెద్దపీట వేయాలి తెల్పింది.
విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి 8 నెలల క్రితం ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల వీసీలు, డిగ్రీ అధ్యాపకులు, విద్యార్థులతో చర్చలు జరిపిన అనంతరం ఇటీవలే ఆయా సిఫార్సులతో కూడిన నివేదికను ఉన్నత విద్యామండలికి ఐఎస్‌బీ అందజేసింది. ఉన్నత విద్యామండలి అధికారులు దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై త్వరలో విద్యాశాఖ మంత్రితో చర్చించి అమలుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా ఐఎస్‌బీ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 258 మంది కాలేజీల అధ్యాపకులు, 692 మంది విద్యార్థుల అభిప్రాయాలను సర్వే రూపంలో సేకరించి ఈ సిఫార్సులు చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.