కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలు అల్లాడిపోయాయి. కోట్ల జనాభా పిట్టల్లారాలిపోయారు. దీంతో మహమ్మారి నుంచి ప్రాణాలు దక్కించుకునేందుకు కోవిడ్ వ్యాక్సిన్లు ఎడాపెడా వేయించుకున్నారు. ఐతే కోవిడ్ వ్యాక్సిన్లు ప్రజలకు మేలు కన్నా ఎక్కువగా కీడు చేస్తున్నాయని పలువురు అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్లు వేయించుకన్న వారిలో రోగనిరోధక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోందని, అందుకే యువత చిన్న వయసులోనే గుండెపోట్లకు గురవుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్లు తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదని సుప్రీంకోర్టుకు గతంలోనే తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఐతే వ్యాక్సిన్లు తీసుకోవాలా లేదా అనేది వ్యక్తిగతంగా ఎవరికి వారు స్వతహాగా నిర్ణయించుకోవాలని సూచించారు. ఇప్పటికే వ్యాక్సిన్లు వేసుకున్న వారు సులభమైన హోమియో, ప్రకృతి చికిత్సల ద్వారా డీటాక్స్ చేసుకుంటే మంచిదని సూచించారు.
అవేకన్ ఇండియా మూవ్‌మెంట్ తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్‌లో శనివారం ‘యువతలో ఆకస్మిక గుండెపోట్లు’ అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్లోపతి, హోమియో వైద్య నిపుణులు, స్వచ్ఛంద కార్యకర్తలు ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ హోమియో వైద్యులు డాక్టర్ అంబటి సురేంద్ర రాజు మాట్లాడుతూ.. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు రోగనిరోధక శక్తిని కాపాడుకోవాలన్నారు. అందుకోసం తుజ–30, వాక్సినీనమ్–30, మలాండ్రినమ్–30 అనే హోమియో మందులు వాడుకోవచ్చని సూచించారు. ఈ గుళికలను ఒక్కొక్క రకాన్ని రోజుకు ఒకసారి 6 గుళికల చొప్పున 3 రోజుల పాటు మొత్తం 9 రోజుల పాటు నోట్లో వేసుకుని మింగకుండా, చప్పరించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య నిపుణులు కోవిడ్ మాట్లాడుతూ కోవిడ్‌ను అల్లోపతి, హోమియోపతి, ప్రకృతి, యునానీ వంటి సహజపద్ధతుల్లో ఏ విధంగా నయం చేసుకోవచ్చో తెలియజేశారు.
మరోవైపు కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల హార్ట్ ఎటాక్ రిస్క్ ఉండదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసిన సంగతి విధితమే. కోవిడ్ వ్యాక్సిన్లకు, యువతలో వచ్చే హార్ట్ ఎటాక్‌లకు ఎటువంటి లింక్‌లేదని, ఎందరో యువ క్రీడాకారులు, ఆర్టిస్టులు మైదానాల్లోనే కుప్పకూలిన వార్తలు ఇప్పటికే ఎన్నో చూశామన్నారు. వాటిపై దర్యాప్తు జరుగుతోందని చెప్పుకొచ్చారు. కోవిడ్ వైరల్ ఇప్పటికీ వివిధ మ్యుటేషన్లు చెందుతోందని, భారత్‌లోనే ఇప్పటి వరకు దాదాపు 214 భిన్న వేరియెంట్లను కనుగొన్నట్లు ఆయన తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.