
క్రికెట్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందులో మన దేశంలో క్రేజ్ ఎక్కువ. ఇపుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ అభిమానులకు పండుగే. ఇపుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎక్కడ చూసినా సందడే కనిపిస్తోంది. అయితే పెళ్లికి హాజరైతే, ఐపీఎల్ మ్యాచ్ మిస్ అవుతాం కదా.. ఎలా..? అందుకే ఓ నూతన జంట వినూత్న ఆలోచన చేసింది. తమ పెళ్లి జరుగుతున్న వేదికలోనే క్రికెట్ మ్యాచ్ వీక్షించేలా స్క్రీన్ ఏర్పాటు చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో మాధవరావు, సంధ్య దంపతుల పెళ్లి వేడుకల్లో మండపం పక్కనే స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఐపీఎల్ సూపర్ ఓవర్ మ్యాచ్ అతిధులకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది.
ఐపీఎల్ సీజన్‌లో వివాహాలు జరుపుకోవాలంటే అతిథులకు ఐపీఎల్ మ్యాచ్‌లో ప్రత్యక్ష వీక్షణ సదుపాయాన్ని కల్పించాలని భావించారు నూతన దంపతులు. వివాహ మండపానికి పక్కనే పెద్ద స్క్రీన్ పై ఐపీఎల్ మ్యాచ్ ప్రసారాన్ని ఏర్పాటు చేశారు. పెళ్లికి వచ్చిన అతిధులు వివాహాన్ని చూస్తూనే రసవత్తరంగా జరిగిన ఢిల్లీ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ సూపర్ ఓవర్ మ్యాచ్ ని తిలకించి ఆనందాన్ని పొందారు.
అసలే క్రికెట్‌పై పిచ్చి ఉన్న యువత తమ అభిమాన టీం ఆటగాళ్ల ఆటను చూసి కేరింతలు కొడుతూ ఆద్యంతం ఆస్వాదించారు. వివాహం జరుపుకున్న దంపతులు కూడా అతిథులకు మంచి ఆనందాన్ని, వినోదాన్ని పంచామని తమ వివాహం కలకాలం అతిధులకు తమకు సూపర్ ఓవర్ తో గుర్తుండిపోతుందని తెగ సంబర పడిపోతున్నారు.
వీడియో చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..