Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌, జగన్, చంద్రబాబుకు ఆహ్వానాలు.. అమరవీరుల కుటుంబాలకు సైతం

తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరుకానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు.

Revanth Reddy: రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్‌, జగన్, చంద్రబాబుకు ఆహ్వానాలు.. అమరవీరుల కుటుంబాలకు సైతం
Revanth Reddy
Follow us

|

Updated on: Dec 06, 2023 | 5:36 PM

తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేతలు, ఇతర రాష్ట్రాల సీఎంలు హాజరుకానుండటంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. సోనియా, రాహుల్, ప్రియాంక సహ పలువురిని కలిసి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరుకావాలని కోరారు. అగ్రనేతలతోపాటు.. లక్షమందికి పైగా ప్రజలు రానుండటంతో పకడ్బంధీగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు డీజీపీ రవిగుప్తా చెప్పారు. ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లను కాంగ్రెస్‌ నేత మల్లు రవి పరిశీలించారు. భారీగా తరలివచ్చే ప్రజలకు కావాల్సిన వసతులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. ఇక అధికారులంతా ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్ల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్య మంత్రులతో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలు, వివిధ రాజకీయ పార్టీల నేతలకు టీపీసీసీ ఆహ్వానాలు పంపింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌, ఏపీ సీఎం జగన్‌, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌, టీడీపీ అధినేత చంద్రబాబు ను ఆహ్వానించారు. అలాగే మరికొంద‌రు సీనియ‌ర్ నేత‌ల‌కూ రేవంత్ సంత‌కంతో కూడిన ఆహ్వాన ప‌త్రాల‌ను పంపారు.

వీరితో పాటు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సైతం రేవంత్ ఆహ్వానం పంపారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, గాదె ఇన్నయ్య, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కంచె ఐలయ్యలతో పాటు వివిధ కులసంఘాల నేతలను ఆహ్వానించారు. అంతేకాకుండా ప్రమాణస్వీకారానికి రావాల్సిందిగా పలువురు సినీ ప్రముఖులకు సైతం ఆహ్వానాలు పంపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..