Telangana Congress: అసమ్మతి వాదులం కాదు..వీర విధేయులం.. మా తపన..తాపత్రయం అంతా పార్టీ కోసమే! సోనియా గాంధీ(Sonia Gandhi) , రాహుల్ గాంధే(Rahul Gandhi) మా లీడర్లు.. 3 సంవత్సరాలుగా కలుస్తున్నాం.. మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉంటాం.. ఇటీవల 5 రాష్ట్రాల పరిస్థితి.. తెలంగాణలో రాకుడదన్నదే మా బాధ, ఆవేదన. ఇవాళ్టి మీటింగ్ తర్వాత సీనియర్లు ఇచ్చిన సందేశమిది. హైకమాండ్‌కు జై కొట్టారు సరే.. ఇంతకీ ఈ మీటింగ్ టార్గెట్ ఎవరు? ఇంటర్నల్‌గా జరిగిన చర్చ…రచ్చ ఏంటి? ఏం చెప్పాలకున్నారు.. ఏం చెప్పారు..? అంటే ఆదివారం ఉదయం నుంచి జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చూస్తే ఎవరికైనా ఇదే అనిపిస్తుంది. ట్విస్టుల మీద ట్విస్టులతో సాగిన సీనియర్ల మీటింగ్ చివరికి కూడా ట్విస్ట్‌తోనే ముగిసింది.
కాంగ్రెస్ సీనియర్ల మీటింగ్‌పై ఒకటే హడావుడి. వేదిక అశోక హోటల్. మీటింగ్ టైమ్ 11 గంటలు. ఎవరు వస్తారు.? ఏం చర్చిస్తారు? గతంలో మర్రిశశిధర్‌రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశానికి వచ్చినవాళ్లంతా మళ్లీ వస్తారా? ఈ G-10 నేతల అసంతృప్తికి అదనంగా ఎవరైనా తోడైతారా? ఇలా ఎన్నో ప్రశ్నలు. మరెన్నో అనుమానాలు. మొత్తానికి మీడియా అంతా 11 గంటలకు ముందే అశోక హోటల్ ముంది వాలిపోయింది. అక్కడ సీన్ కట్ చేస్తే…
హైకమాండ్ అలెర్ట్ అయింది. వరుసగా సీనియర్లందరికీ ఫోన్లు వెళ్లాయి. అందరికీ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు AICC కార్యదర్శి బోసురాజు. మీటింగ్‌లు పెట్టొద్దని.. ఏమైనా సమస్యలుంటే నేరుగా సోనియా, రాహుల్‌గాంధీతో చర్చించాలని కోరారు. లేనిపోని సమావేశాలతో పార్టీ పరువుని బజారుకి ఈడ్చొద్దంటూ హెచ్చరించారు.. ఈ వార్నింగ్‌లు కాస్త పనిచేసినట్లే కనిపించాయి..ఎందుకంటే ఉదయం 11 గంటలక వరకు మీటింగ్‌కు కేవలం ఇద్దరంటే ఇద్దరే వచ్చారు. అందులో ఒకరు.. ఈ మీటింగ్‌ను ఆర్గనైజ్ చేసిన వీహెచ్. రొకరు మర్రిశశిధర్‌రెడ్డి.
ఇద్దరే వచ్చారు.. అసలు విధేయుల ఫోరమ్ మీటింగ్‌కు ఎవరైనా వస్తారా? అసలు సమావేశం జరుగుతుందా అనేది మరో డౌట్. ఈలోపే మరో ముగ్గురు జాయిన్ అయ్యారు. జగ్గారెడ్డి, కమలాకర్, శ్యామ్‌మోహన్… మొత్తానికి అలా ఆ ఐదుగురితో సమావేశం ప్రారంభమైంది. కాస్త అటూఇటూగా ఓ గంట జరిగింది మీటింగ్. ఇంటర్నల్‌గా ఏం చర్చించారన్నది పక్కన పెడితే.. ఔట్‌కమ్ మాత్రం పద్ధతిగానే చెప్పారు. తమది అసమ్మతి సమావేశం కాదని.. కేవలం పార్టీ విధేయుల సమావేశం మాత్రమేనని స్పష్టం చేశారు మర్రిశశిధర్ రెడ్డి. ఇది ఏ ఒక్కరికో వ్యతిరేకంగా జరిగిన మీటింగ్ కాదని క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేశారు. తామంతా సోనియా, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తామని స్పష్టం చేశారు జగ్గారెడ్డి. కాంగ్రెస్‌కు అసలైన ఓనర్లు ఆ ఇద్దరే అని చెప్పారు.
అలా మీటింగ్ అయిపోయి.. ఇలా నేతలంతా బయటకు వస్తుండగానే మరో ట్విస్టు. ఊహించని విధంగా అక్కడ అద్దంకి దయాకర్ ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందే గాంధీ భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి మరీ సీనియర్లపై గరంగరం అయిన అద్దంకి అండ్ టీమ్ ఒక్కసారిగా అశోక హోటల్‌కి రావడం ఆసక్తికరంగా మారింది. కానీ సీనియర్లెవరూ వారితో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. చివరికి జగ్గారెడ్డితో సమావేశం అయ్యారు. రేపు వీహెచ్, మర్రి శశిథర్ రెడ్డిని కలిసి కూడా మాట్లాడుతామని చెప్పారు. అసమ్మతి నేతల మీటింగ్ వెనుక TRS కుట్ర ఉందని ఆరోపించారు.
మొత్తానికి అనేక ట్విస్టుల మధ్య ముగిసింది విధేయుల ఫోరమ్ మీటింగ్. అయితే చాలా మంది నేతలు దూరంగా ఉన్నారు. మరి ఈ సమావేశాన్ని హైకమాండ్ ఎలా చూస్తుంది.? వద్దని చెప్పినా మీటింగ్ నిర్వహించిన ఆ ఐదుగురిపై ఏమైనా చర్యలుంటాయా? లేక ఇది పార్టీ వ్యతిరేక మీటింగ్ కానే కాదు… కేవలం వీర విధేయుల మీటింగే అని నేతలంతా స్పష్టంగా చెప్పారు కాబట్టి లైట్ తీసుకుంటారా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.
రేవంత్‌రెడ్డి Vs జగ్గారెడ్డి!
ఇదిలావుంటే, ఇన్నిరోజులు ఒక లెక్క..ఇప్పటి నుంచి మరో లెక్క.! షోకాజ్ నోటీసులకు భయపడేది లేదు. సస్పెండ్ చేసినా తగ్గేది లేదు.! నేనో ఎపిసోడ్ వదలుతా.! జరుగుతున్న కుట్రలు, చేస్తున్న ద్రోహాలు అన్నీ.. అన్నీ బయటపెడుతా..! రేపటి నుంచే స్టార్ట్ చేస్తా…! ఇది జగ్గారెడ్డి ఇచ్చిన స్వీట్ వార్నింగ్. రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డికి మధ్య గ్యాప్ ఉంది. ఇద్దరికీ పడటం లేదు. ఇది కాంగ్రెస్ శ్రేణులతోపాటు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా ఖుల్లం ఖుల్లాగా చెప్పాలంటే ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఒకటి కాదు రెండు కాదు..అనేక సందర్భాల్లో రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. వన్‌మ్యాన్ షో చేస్తున్నారని..ఏకపక్షంగా ఒంటెద్దు పోకడలు పోతున్నారని విమర్శించారు. ఇవన్నీ కాంగ్రెస్‌లో పనిచేయవంటూ అనేక సార్లు హెచ్చరించారు కూడా. PCCలో జరుగుతున్న పరిణామాలు నచ్చక…. ఒకానొక సందర్భంలో రాజీనామాకు సిద్ధపడ్డారు. కాంగ్రెస్‌కు హైకమాండ్‌కు ఘాటు లేఖ రాశారు కూడా. ఆ కోల్డ్‌వార్ అలా కొనసాగుతోంది. సరే ఇదంతా ఒక ఎపిసోడ్.
కానీ, ఇవాళ్టి సీనియర్ల మీటింగ్‌కు ముందు ఆ తర్వాత రేవంత్‌రెడ్డిపై అనేక సంచలన ఆరోపణలు చేశారు జగ్గారెడ్డి. రేవంత్ కాంగ్రెస్‌లోకి రాక ముందు ఆ తర్వాత PCCలో వచ్చిన మార్పులను చెప్పుకొచ్చారు. అంతే కాదు..TRS కోవర్టుగా తనపై ముద్ర వేసేందుకు ఎవరు ఎలాంటి కుట్రలు చేశారు. చేస్తున్నారో కూడా వెల్లడించారు ఇది మీటింగ్ ముందు జరిగిన సీన్.. మీటింగ్ తర్వాత కూడా రేవంత్‌రెడ్డిపై శివాలెత్తిపోయారు జగ్గారెడ్డి. ముఖ్యంగా మూడు ఇష్యూస్‌ని లేవనెత్తారు.
1. టీడీపీ ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరెవర్ని వాడుకున్నారు?
2. అసెంబ్లీకి వచ్చి లోపల నాతో ఏం మాట్లాడారు?
3. నాకు తెలియకుండా దామోదర రాజనర్సింహను మెదక్ తీసుకొని ఎలా వెళ్లాడు.?
ఇవే కాదు..పార్టీని ముంచేందుకు ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో కూడా చెబుతానంటుూ సంచలన ఆరోపణలు చేశారు జగ్గారెడ్డి. కేవలం రేవంత్‌రెడ్డి ఒక్కరే కాదు..రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌పైనా నేరుగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.. విషయం అంత తేలిగ్గా ఏమీ లేదు. ఇది ఇక్కడితో ముగిసేలా కూడా కనిపించడం లేదు. దేనికైనా సిద్ధం అంటూ సవాల్ చేస్తున్నారు జగ్గారెడ్డి. పార్టీలో జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నిస్తూనే ఉంటానని చాలా చాలా స్పష్టంగా చెబుతున్నారు. అందేకాదు పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కాంగ్రెస్ విధేయుడిగానే కొనసాగుతానంటున్నారు. మరి ప్రకటించినట్లుగానే జగ్గారెడ్డి ఎపిసోడ్ వైస్‌గా చిట్టా విప్పుతారా? పార్టీలోని కుట్రలను బయటపెడుతారా అన్నది ఉత్కంఠను రేపుతోంది.
Read Also….