Telangana BJP: తెలంగాణ బీజేపీలో మళ్లీ మొదలైన అంతర్గత కుమ్ములాటలు..! ఆ లిస్టులో మరో నేత..

Telangana BJP: తెలంగాణ బీజేపీలో రోజురోజుకూ విభేదాలు పెరుగుతున్నాయా..? అంతర్గత కుమ్ములాటలతో అసంతృప్త రాగాలు వినిపిస్తున్నాయా? తన గెలుపుతో పార్టీకి ఊపు తెచ్చిన నేత ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారా? తన సంగతి ఏంటో తేల్చే వరకు పార్టీ కార్యక్రమాలకు వచ్చేది లేదంటున్న ఆ నేత ఎవరు..? ఇంతకీ టీ బీజేపీలో ఏం జరుగుతోంది?

Telangana BJP: తెలంగాణ బీజేపీలో మళ్లీ మొదలైన అంతర్గత కుమ్ములాటలు..! ఆ లిస్టులో మరో నేత..
Telangana Bjp

Updated on: Jun 30, 2023 | 8:44 AM

Telangana BJP: తెలంగాణ బీజేపీలో కల్లోలం కొనసాగుతోంది. రోజుకో ఇష్యూ తెరపైకొచ్చి రచ్చ రేగుతోంది. రాష్ట్ర నాయకత్వంలో మార్పులంటూ చెలరేగిన చిచ్చు..సునామీలా మారుతోంది. తాజాగా టీ బీజేపీలో జరుగుతోన్న అంతర్యుద్ధం ఎలాగుందో ఒకే ఒక్క ట్వీట్‌తో బయటపెట్టేశారు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి. దున్నపోతును కాలితో తన్నే వీడియో ఒకటి షేర్‌ చేశారాయన. ఆ ట్వీట్‌ డిలీట్‌ చేసి, తిరిగి మళ్లీ అదే వీడియోను పోస్ట్‌ చేశారు. అయితే. దీనిని బండి సంజయ్‌కి సపోర్ట్‌గా, కొందరు నేతలు టార్గెట్‌గా ఈ పోస్ట్‌ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్‌ టీ బీజేపీలో సంచలనంగా మారింది. తన ట్వీట్‌ బండి నాయకత్వాన్ని ప్రశ్నించే వాళ్లకేనని చెప్పడం చూస్తే, టీ బీజేపీలో విభేదాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధంచేసుకోవచ్చు.

ఇక 2014 నుంచి కేసీఆర్ విజయ ప్రస్థానానికి బ్రేకులు వేసి బీజేపీకీ కాస్త ఊపు తెచ్చింది దుబ్బాక ఎన్నిక. ఆ ఎన్నికల్లో BRS పార్టీని బలంగా ఎదుర్కొని గెలిచిన దుబ్బాక MLA రఘునందన్‌రావు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. టీవీ ఛానల్‌లో డిబేట్లో, ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌లతో యాక్టివ్‌గా ఉండే రఘునందన్‌రావు కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నారు. ఈ మౌనం వెనుక కారణం ఏంటి? అని ఆరా తీస్తే ఆయన మనసులో ఉన్న లోతైనా అసంతృప్తి బయటికి వచ్చింది. తన సన్నిహితుల వద్ద అసంతృప్తిని వ్యక్తపరిచినట్లు సమాచారం.

పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అసంతృప్తిగా ఉన్నారు MLA రఘునందన్‌రావు. కీలక బాధ్యతలు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కులాన్ని చూపి పదవులు అడ్డుకుంటున్నారని ఆవేదన చెందారట. కేసీఆర్‌ ది తనది ఒకే కులం కావడంతో పార్టీ పదవులకు దూరం పెడుతున్నారనేది రఘునందన్‌ వాదన. అసెంబ్లీలో ఫ్లోర్‌ లీడర్‌, జాతీయ అధికార ప్రతినిధి హోదా, జాతీయ కార్యవర్గంలో చోటు, రాష్ట్రపార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బీఎల్‌ సంతోష్‌తోపాటు జాతీయ నాయకత్వం ముందు రిక్వెస్ట్‌ పెట్టుకున్నారు. అవన్నీ ఇవ్వడానికి కులం అడ్డొస్తుందంటూ కొంతమంది నాయకులు చెప్పడంతో మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

BRSకు కోవర్టు అంటూ సొంతపార్టీలో ప్రచారం చేస్తున్నారనేది రఘునందన్ సన్నిహితుల వద్ద అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కీలక అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి అవకాశం ఇవ్వకపోవడంతోపాటు ORR అంశంలో నోటీసులపై పార్టీ అండగా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఇక తన విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరి తెలియజేసే వరకు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని రఘునందన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో..రఘునందన్‌ విషయంలో బీజేపీ నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..