TS Congress: ఢిల్లీలో రెండు, మూడు రోజులుగా తీవ్ర కసరత్తు.. టీ.కాంగ్రెస్‌లో కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక..

తెలంగాణ కాంగ్రెస్‌లో కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక.. ఢిల్లీలో రెండు, మూడు రోజులుగా తీవ్ర కసరత్తు.. ఎస్‌.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీ.కాంగ్రెస్‌ వేగం పెంచింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. తొలి జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేస్తోంది. ఇంతకీ.. ఫస్ట్‌ లిస్ట్‌లో ఎంతమంది పేర్లు ప్రకటించబోతున్నారు?.. అభ్యర్థుల ఎంపికపై టీ.కాంగ్రెస్‌ నేతలు ఏమంటున్నారు?..

TS Congress: ఢిల్లీలో రెండు, మూడు రోజులుగా తీవ్ర కసరత్తు.. టీ.కాంగ్రెస్‌లో కొలిక్కి వస్తున్న అభ్యర్థుల ఎంపిక..
Ts Congress

Updated on: Sep 24, 2023 | 6:35 AM

ఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణ పాలిటిక్స్‌ పీక్‌ స్టేజ్‌కు చేరాయి. అధికార బీఆర్ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ కూడా క్యాండేట్స్‌ లిస్టు రిలీజ్‌ చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. అందులోనూ.. టీ.కాంగ్రెస్‌ ఓ అడుగు ముందుకేసి.. తొలి జాబితాపై ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. దాదాపు 1000 మందికి పైగా ఆశావహుల్లో 300 మంది జాబితాను స్క్రీనింగ్ కమిటీ ముందు పెట్టింది టీ.పీసీసీ. దాంతోపాటు.. అభ్యర్థులను ఎంపికలో పార్టీ సలహాదారు సునీల్ కనుగోలు సహా మరికొన్ని సంస్థలతో జరిపిన సర్వే నివేదికలు, సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంది.

ఆపై జాబితాను స్క్రీనింగ్ కమిటీకి పంపగా రెండు రోజుల పాటు చర్చించారు. వడపోత తర్వాత జాబితాపై కొంత క్లారిటీకి వచ్చిన స్క్రీనింగ్ కమిటీ.. దానిని కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపింది. కాంగ్రెస్‌ సీఈసీ ఆమోదం తర్వాత ఏఐసీసీ ఫైనల్‌ చేసి ఆ జాబితాను విడుదల చేయనుంది. ఈ క్రమంలోనే.. తొలి దశ జాబితా కొలిక్కి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

తొలి జాబితాలో 50 శాతానికి పైగా అభ్యర్థుల ప్రకటన..

టీ.కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే. స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన అభ్యర్థుల జాబితాపై కాంగ్రెస్‌ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. తొలి జాబితాలో 50 శాతానికి పైగా అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలిపారు ఠాక్రే.

తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలని చూస్తుండటంతోనే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా ఆలస్యం అవుతుందన్నారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి.

ఫైనల్‌ అయ్యేలోపే అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం

అధిష్టానం పెద్దలను కలిసి ఆశావహుల పైరవీలు కొనసాగుతున్నాయి. ఇదిలావుంటే.. టీ.కాంగ్రెస్‌లో టిక్కెట్లు ఆశిస్తున్న మరికొందరు ఆశావాహులు.. హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. అభ్యర్థుల వడపోత ఫైనల్‌ అయ్యేలోపే అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అధిష్టానం పెద్దలను కలిసి పైరవీలు చేసుకుంటున్నారు. మొత్తంగా.. గత రెండు, మూడు రోజుల కసరత్తు తర్వాత టీ.కాంగ్రెస్‌ ఫస్ట్‌ లిస్ట్‌పై క్లారిటీ వచ్చినప్పటికీ.. ఎప్పుడు ప్రకటిస్తారన్నది మాత్రం సస్పెన్స్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి