పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా స్తంభానికి కట్టేసి ఇద్దరు యువకులను చితకబాదరు. అపై గుండు గీసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నడుచుకుంటూ వెళుతున్న ఇద్దరు వ్యక్తులు.. ఆటో బ్యాటరీలను చోరీలకు పాల్పడుతున్నారని అనుమానంతో స్తంభానికి వైర్లతో కట్టి గుండు గీసిన అవమానపరిచిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని హైమద్‌నగర్‌లో చోటు చేసుకుంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అహ్మద్ నగర్‌లో మొహమ్మద్ ఖుద్దూస్, మహ్మద్ ఖాజా శనివారం ఉదయం మదీనా మజీద్ వీధిలో వెళ్తున్నారు.
బ్యాటరీ చోరీలకు పాల్పడి వెళుతున్నట్లుగా అనుమానంచి అదే బస్తీకి చెందిన.. అబ్దుల్ రెహ్మన్, మమ్మద్ అలీ, జావేద్ మహమ్మద్ గౌస్, మహమ్మద్ భారీ.. వీరిని అడ్డుకన్నారు. ఓ స్తంభానికి ఇద్దర్నీ వైర్లతో కట్టి మెడలో బ్యాటరీలను వేలాడదీశారు. అంతటితో ఆగకుండా వైర్లతో చితకబాది ఇద్దరు యువకులకు అరగుండు గీయించారు.
ఈ తతంగాన్ని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ఈ అవమానం తట్టుకోలేని యువకులు.. సోమవారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఐదు మందిపై కేసు నమోదు చేశారు.
ఇవి కూడా చదవండి: Capsule Two Colors: క్యాప్సూల్‌కు రెండు రంగులు ఎందుకుంటాయో తెలుసా.. దాని వెనుక ఉన్న రహస్యం ఏంటంటే..
Job Promotion Tips: ఉద్యోగంలో త్వరగా ప్రమోషన్ పొందాలనుకుంటున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..