Telangana: దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో లిక్కర్ అలర్జీ కేసు నమోదు..

|

May 18, 2023 | 9:26 PM

దేశంలో మొదటిసారిగా లిక్కర్ అలర్జీ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని అశ్విని హాస్పిటల్ లో ఈ మద్యం అలర్జీ కేసు నిర్ధారణ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం నుంచి వచ్చిన జాన్ (36) అనే యువకుడికి ఆల్కహల్ అలర్జీ అయినట్లు తెలిపారు.

Telangana: దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో లిక్కర్ అలర్జీ కేసు నమోదు..
Liquor Allergy
Follow us on

దేశంలో మొదటిసారిగా లిక్కర్ అలర్జీ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని అశ్విని హాస్పిటల్ లో ఈ మద్యం అలర్జీ కేసు నిర్ధారణ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా ప్రాంతం నుంచి వచ్చిన జాన్ (36) అనే యువకుడికి ఆల్కహల్ అలర్జీ అయినట్లు తెలిపారు. కొన్ని వేల మందికి ఇలాంటి పరిస్థితి ఉండవచ్చని.. నిర్దారణ కాని పరిస్థితి ఉందని అలర్జి నిపుణులు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్ పేర్కొన్నారు.

అయితే జాన్ తన మిత్రులతో కలిసి ఓ పార్టీలో పాల్గొన్నాడని ఆ తర్వాత అందరూ కలిసి మద్యాన్ని సేవించారని నాగేశ్వర్ చెప్పారు. అయితే అందరితో పాటు జాన్ మద్యం సేవించాడని.. 15 నిమిషాల తర్వాత ముఖమంతా ఎర్రబడిపోయి వేడిగా మారడం, చర్మంపై దురదలు రావడం, ఛాతీ బరువుగా అనిపించడంతో పాటు ఆయాసం వంటి లక్షణాలు కనిపించాయని బాధితుడు చెప్పినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రపంచంలోని 100 కుపైగా ఇలాంటి కేసులు నమోదు అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..