Telangana TSSPDCL Slab: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత తప్పదా?.. యూనిట్‌కు ఎంత మేర పెరగనుందంటే..!

|

Dec 27, 2021 | 6:46 PM

Telangana TSSPDCL Slab: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి డిస్కమ్స్. ఎల్‌టి కస్టమర్స్‌కు యూనిట్ కు 50 పైసలు..

Telangana TSSPDCL Slab: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల మోత తప్పదా?.. యూనిట్‌కు ఎంత మేర పెరగనుందంటే..!
Follow us on

Telangana TSSPDCL Slab: తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనలను ఈఆర్సీకి సమర్పించాయి డిస్కమ్స్. ఎల్‌టి కస్టమర్స్‌కు యూనిట్ కు 50 పైసలు, హెచ్‌టి కష్టమర్స్‌కు యూనిట్ కు ఒక రూపాయి చొప్పున పెంచాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని తెలంగాణ ఎస్పీడీఏసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి వెల్లడించారు. రైల్వే చార్జీలు, బొగ్గు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం అయ్యిందన్నారు. గత 5 సంవత్సరాలుగా పెంచలేదని, కానీ ఇప్పుడు పెంచకతప్పదని అన్నారు. 20 సంవత్సరాల తర్వాత 50 యూనిట్ల వరకు ఛార్జీలు పెంచలేదన్నారు. ఇప్పుడే యూనిట్‌కు 50 పైసలు పెంచుతున్నామని చెప్పారు. గత ఐదు సంవత్సరాలుగా టారిఫ్ రివిజన్ లేదన్న ఆయన.. డొమెస్టిక్ వినియోగదారులకు యూనిట్ కు 50పైసలు పెంచుతామని తెలిపారు. ఇతర వినియోగదారులకు యూనిట్ కు రూపాయి పెంచాలని భావిస్తున్నామన్నారు.

ఈ పెంపు వల్ల డిస్కమ్స్‌కు రూ. 2,110 కోట్ల ఆదాయం వస్తుందని రఘుమారెడ్డి తెలిపారు. హెచ్.టీ వినియోగదారులకు యూనిట్ కు రూపాయి పెంచాలని భావిస్తున్నామని, దాంతో రూ. 4,721 కోట్ల ఆదాయం రావొచ్చని అంచాన వేస్తున్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, దీని వల్ల 25.78 లక్షల పంపుసెట్లకు విద్యుత్ అందుతున్నారు. ఇది యధావిధిగా ఉంటుందని రఘుమారెడ్డి స్పష్టం చేశారు. మొత్తంగా చార్జీల పెంపుతో డిస్కంలకు రూ.6,831 కోట్ల ఆదాయం రానుందన్నారు. ఎల్.టీ (డొమెస్టిక్)కనెక్షన్ లపై యూనిట్‌కు రూ.50 పైసలు పెంచడం ద్వారా రూ. 2,110 కోట్ల ఆదాయం, హెచ్.టి కనెక్షన్ లపై యూనిట్ కు రూ.1 పెంపు ద్వారా రూ. 4,721 కోట్లు ఆదాయం వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ డొమెస్టిక్ వినియోగదారులకు 101 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఇక హెయిర్ కటింగ్ సెలూన్లకు 250 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్, పవర్ లూమ్స్, పౌల్ట్రీ రంగానికి యూనిట్ కు రూ. 2 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు.

Also read:

Viral Video: గేటు దూకి పెంపుడు కుక్కను నోటకరుచుకుని ఎత్తుకెళ్లిన చిరుత‌.. చూస్తే వణుకు పుట్టాల్సిందే!

Dil Raju: సీఎం జగన్ అపాయింట్ మెంట్ ఇస్తే కలుస్తాం.. టికెట్ ధర మాత్రమే కాదు.. అనేక సమస్యలున్నాయన్న నిర్మాత దిల్ రాజు..

Sore Throat Issue: టాన్సిల్స్ సమస్యతో సతమతం అవుతున్నారా?.. హోమ్ రెమిడీస్‌తో ఇలా సులభంగా చెక్ పెట్టండి..