CET Exams: తెలంగాణలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలు మీకోసం..

|

Aug 02, 2021 | 12:32 PM

CET Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈసెట్, ఎంసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ ఇలా అన్ని..

CET Exams: తెలంగాణలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్.. ఏ పరీక్ష ఎప్పుడంటే.. పూర్తి వివరాలు మీకోసం..
Exams
Follow us on

CET Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. ఈసెట్, ఎంసెట్, పీజీసెట్, ఐసెట్, ఎడ్ సెట్, లాసెట్ ఇలా అన్ని పరీక్షలు ఆగస్టు నెలలో ఉన్నాయి. కాగా, తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ ఈసెట్)-2021 రేపు జరుగనుంది. దీంతో పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఎస్ ఈసెట్ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. సీబీటీ(కంప్యూటర్ బేస్‌డ్ టెస్ట్) విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు హాల్ టిటెక్‌పై ఇచ్చిన సూచనలను ఖచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. లేదంటే.. విద్యార్థులను పరీక్ష హాల్‌ లోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. కోవిడ్ నిబంధనల మే పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.

కాగా, తెలంగాణ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభం కానున్న సెట్ ఎగ్జామ్స్ వివరాలు..
ఆగస్టు 3వ తేదీన ఈసెట్ పరీక్ష జరుగనుంది.
ఆగస్టు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నారు. 4, 5, 6 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు.. 9,10 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు నిర్వహిస్తారు.
11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు పీజీ సెట్ పరీక్షను జరుపుతారు.
ఆగస్టు 19, 20 తేదీల్లో ఐసెట్ నిర్వహిస్తారు.
ఆగస్ట్ 23వ తేదీన లాసెట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఆగస్ట్ 24, 25 తేదీల్లో ఎడ్ సెట్ పరీక్ష నిర్వహించనున్నారు.

Also read:

Viral Video: మనుషుల గ్యాంగ్ వార్ చూశారు.. మరి కోతుల గ్యాంగ్ వార్ చూశారా? అయితే ఇప్పుడు చూసేయండి..

India Bangladesh Train: భారత్-బంగ్లా సరిహద్దుల్లో చారిత్రాత్మక ఘట్టం.. 56 ఏళ్ల క్రితం నిలిచిపోయిన..

TS Weather Alert: తెలంగాణలో చలిగాలులు.. రాగల మూడు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్..