AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: కొన్ని గంటల్లో కూతురు పెళ్లి.. ఆవలిస్తూ ప్రాణాలు కోల్పోయిన తండ్రి..!

Telangana: నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పచ్చని పందిళ్లో సంతోషంగా జరగాల్సిన పెళ్లి.. తీవ్ర విషాదంతో బ్రేక్ పడింది. బతుకుదెరువుకోసం

Telangana: కొన్ని గంటల్లో కూతురు పెళ్లి.. ఆవలిస్తూ ప్రాణాలు కోల్పోయిన తండ్రి..!
Father Died
Shiva Prajapati
|

Updated on: Jun 19, 2022 | 5:33 AM

Share

Telangana: నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పచ్చని పందిళ్లో సంతోషంగా జరగాల్సిన పెళ్లి.. తీవ్ర విషాదంతో బ్రేక్ పడింది. బతుకుదెరువుకోసం కువైట్ వెళ్లిన తండ్రి.. అకస్మాత్తుగా అక్కడే చనిపోవడంతో అతని కూతురు పెళ్లి నిలిచిపోయింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బిర్నంది గ్రామానికి చెందిన శాతం లచ్చన్న బ్రతుకుదేరువు కొరకు గత 12 సంవత్సరాల క్రితం కువైట్‌కు వెళ్లాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి ఇప్పటికే చేయగా.. ఇవాళ రెండవ కూతురు పెళ్లి జరగాల్సి ఉంది. అయితే, ఇంతలోనే పిడుగులాంటి వార్త ఆకుటుంబాన్ని అతలాకుతలం చేసింది. కువైట్‌ నుంచి వచ్చిన ఫోన్ వారి భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టింది. కువైట్‌లో నిన్న రాత్రి లచ్చన్న ఆవలిస్తూ.. గుండెపోటుకు గురయ్యాడు. క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. దాంతో అతని సహచరులు లచ్చన్న ఇంటికి ఫోన్ చేసి.. సమాచారం అందించారు. లచ్చన్న ప్రాణాలు కోల్పోయినట్లు అతని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. లచ్చన్న మృతితో ఆ ఇంట్లో పెళ్లి బాజాలు ఆగిపోయాయి. బాధిత కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!